నోరూరించే మామిడికాయ పచ్చడి అంటే ఇష్టం కానివారుండరు
అందులో పచ్చికొబ్బర మామిడికాయ పచ్చడి అంటే ఇక చెప్పాలా
వేడి వేడి అన్నంలోకి కలుపుకొని తింటుంటే నా సామిరంగా పదిముద్దలు ఇట్టే పోవు కడుపులోకి
మరి అంత కమ్మగా ఉండే మామిడికాయ పచ్చడి మీకు చేసుకోవాలని ఉండదూ పాపం
అందుకే మీ అందరికోసమే నేను ఇవాళ ఈ పచ్చడి వండుకొన్నాను మీకు చూపిద్దామని
మరి ఈ పచ్చడికి ఏమేమి కావాలో చూద్దామా?
కావలసిన పదార్థాలు
మాంచి పుల్ల మామిడికాయలు----2
పచ్చికొబ్బర తురుము-------------సగం చిప్ప
ధనియాలు-------------------------1 టేబల్‌స్పూన్
ఉద్దిపప్పు--------------------------2 టేబల్‌స్పూన్స్
ఆవాలు----------------------------1 టేబల్‌స్పూన్
మెంతులు-------------------------10 గింజలు
ఎండుమిర్చి-----------------------15
పచ్చిమిర్చి------------------------5
కొద్దిగ గట్టి చింతపండు.....
అన్ని పోపుగింజలతో పాటు,ఇంగువ కూడ వేయాలి.
ఎండుమిర్చి...4....కరెపాకు..రెండు రెబ్బలు
కొత్తమీర తురుము...2..టేబల్‌స్పూన్స్
నూనె....2....టేబల్‌స్పూన్స్
తగినంత...ఉప్పు..పసుపు...బెల్లం.
చేసే విధానము:::
మామిడికాయలు బాగా కడిగి నీళ్ళు లేకుండగ గుడ్డతో తుడిచి చిన్న ముక్కలు చేసి ఉంచుకొండి
కొబ్బర తురుము రెడిగా ఉంచుకోండి.
ష్టవ్ పై మూకుడు పెట్టి మూకుడు వేడి అయిన తరువాత అందులో
మినపప్పు,ధనియాలు,మెంతులు,ఆవాలు,ఎండుమిర్చి అన్ని దోరగా వేయించి పక్కన పెట్టుకొండి.
అదే మూకుడులో కొద్దిగ నూనె వేసి పచ్చిమిర్చిని వేయించుకోండి.
ఆ తరువాత గ్రైండర్ లో ఈ వేయించిన వన్ని వేసి..వాటితో పాటే మామిడి
ముక్కలు,కొబ్బరకోరు,చింతపండు,బెల్లం,ఉప్పు,పసుపు,పచ్చిమిర్చి,వేసి కొద్దిగ నీళ్ళువేసి
గ్రైండర్లో మెత్తగా చేసుకోండి.
గ్రైండ్ అయిన మామిడికాయ పచ్చడి ని వేరే గిన్నెలోకి తీసి ఉంచండి.
మూకుడులో ఒకటిన్నర స్పూన్ నూనె వేసి...పోపుగింజలన్ని వేసి ఎండుమిర్చితోపాటు ఇంగువకూడవేసి
చివర్లో కరేపాకు కొత్తమీర వేసి ...ఆ పోపును పచ్చట్లో వేసి బాగా కలిపి serve చేయడమే....
వేడి వేడి అన్నానికి కొద్దిగ నూనె వేసుకొని కలుపుకొని తింటే.......వావ్..అనుకొంటూ...రెండు ముద్దలు ఎక్కువనే తింటారు.....
మీకు ఈ పచ్చడి చేసుకొని తిని నచ్చితే నాకో చిన్న మెస్సేజ్ పెట్టండి బంగారు తల్లులూ....
!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!
మా జయచిత్తి (పిన్ని) చెప్పిన
రెండో రకం మామిడికాయ పచ్చడి
పచ్చికొబ్బర మావిడికాయ పచ్చడి
medium size మావిడికాయ పుల్లగా ఉంటే ఒకటి..పుల్లగ లేకుంటే రెండు వేసుకొండి
మావిడికాయ-------- 1
పచ్చికొబ్బర-------- సగం చిప్ప (తురిమి పెట్టుకొండి)
మెంతులు----------- 1/2 స్పూన్
ఆవాలు-------------- 1 స్పూన్
ఎండుమిర్చి-------- 15 లేక 20( కారం తగినంత)
ఇంగువ-------------- 1/4 స్పూన్
పసుపు--------------- 1/4 టీ స్పూన్
బెల్లం----------------- 1/4 స్పూన్
ఉప్పు...రుచికి తగినంత
నూనె..........తగినంత
:::తిరుగువాతకు కావలసినవి:::
మినపప్పు..శనగపప్పు..ఆవాలు..జిలకర్ర..ఎండుమిర్చి..ఇంగువ.
::::పచ్చడి చేసేవిధానము::::
1::మావిడికాయలు బాగా కడిగి పై పొట్టు పీల్ చేసి ముక్కలు చేసి ఉంచండి.
2:: కొబ్బర తురిమి ఉంచుకొండి.
3:: పాన్ లో 1/4 స్పూన్ నూనె వేసి అందులో పించ్ ఇంగువ వేసి మెంతులు,,ఎండుమిర్చి,,వేయించి పెట్టుకొండి.
4:: ఆవాలు పచ్చివి ఉంచుకొండి.
5:: ఇప్పుడు వేయించిన మెంతులు,,ఎండుమిర్చి,,పచ్చి ఆవాలు,,ఉప్పు,,పసుపు,,బెల్లం,,కొబ్బరకోరు,,మావిడికాయ ముక్కలు...అన్ని mixie jar లో వేసి grind చేసుకోండి...నీళ్ళు వేయకుండగా చేయాలి.
ఆ తరువాత జార్ లోనుండి పచ్చడి తీసి గిన్నెలో వేసుకొని...తిరుగువాత పెట్టండి.
6:: కడాయిలో 3 స్పూన్స్ నూనె వేసి నూనె కాగినాక అందులో తిరుగువాత గింజలు వేసి అవి దోరగా వేగాక ఎండుమిర్చి చివర్లో వేసి కొద్దిగ ఇంగువ వేసి ఆ తిరుగువాతను పచ్చడిలో వేసి కలిపి......
వేడి వేడి అన్నానికి కలుపుకొని తింటే నాసామిరంగా... మళ్ళీ నాలుగు ముక్కలు ఎక్కువగా లాగించేస్తారు సుమా.....
No comments:
Post a Comment