బీన్స్ 200 గ్రా
శనగపప్పు 100 గ్రా
పచ్చిమిర్చి 10
కొబ్బెర తురుము 1/2 కప్పు
అల్లం చిన్న ముక్క
నూనె 100 గ్రా
కరేపాక్ , కోత్తిమీర 2 టేబుల్ స్పూన్స్ తరుగు
తాలింపు గింజలు 2 టీ స్పూన్స్
ఎండుమిర్చి 2 ,ఉప్పు , పసుపు , తగినంత
చేసే విధానం::
శనగపప్పు కడిగి 2 గంటలు నాన బెట్టి జల్లెడలో వేసి నీరు తీసి, పచ్చిమిర్చి , కొబ్బెర , అల్లం , శనగపప్పు , మిక్సిలో వేసి ముద్ద చేసి ఉంచండి . కొంచెం నూకగా రుబ్బాలి , మెత్తగా వుండకూడదు . బాండిలో నూనె వేడి చేసి తాలింపు వేసి ఎండుమిర్చి , కరేపాకు వేసి దోరగా వేగాక బీన్స్ తరుగు , వేసి, మూతపెట్టి వుడికించి , ముక్క వుడికిన తరువాత పసుపు , రుబ్బిన శనగపప్పు ముద్దను , ఉప్పు , వేసి , బాగా దోరగా వేయించి , అట్లకాడతో వేయిస్తు వుండాలి . ముద్ద బాగా పొడి పొడి గా అయ్యేంతవరకు వేయించి కోత్తమీర వేసి సర్వ్ చేయండి , బీన్స్ పొరియల్ నెయ్యి వేసిన రైస్ లోకి , సాంబర్ రైస్ లోకి , రసం రైస్ లోకి , చాలా రుచిగావుంటుంది . ఇది తమిళులు ఎక్కువగా చేస్తారు .
No comments:
Post a Comment