Thursday, January 20, 2011

బెండి మసాల ( బెండకాయతో మసాల ) Ladies Fingers )





మన నార్త్ వాళ్ళు ఈ మసాలని బెండి మసాలని పిలుస్తారు)

ఈజిగా చేయాలని ఎవరికైనా ఆశ వుంటుంది

10 నిముషల్లో బాక్స్ పాక్ చేసుకొని చకచక ఆఫీస్ వెళ్ళే వనితలకు

short time లో కమ్మటి మసాల ఐటం ఇది

చపాతికి , పుల్కాకి, రైస్ కి భలే రుచిగా వుంటుంది

ఇక వంటకి తయార్ అవుదామా... :)



కావలసిన పధార్థాలు :-


బెండి ----- 1/2 కిలో

ఆనియన్ ----- 3

వెల్లుల్లి పాయలు ----- 6

టోమాటో ----- 5

గరం మసాల పౌడర్ ----- 1 టేబల్ స్పూన్

ఎండు మిర్చి పౌడర్ ----- 1/2 తీ స్పూన్

ధనియా పౌడర్ ------ 1 టీ స్పూన్

నూనే / కొద్దిగ గీ(డాల్డ ------ 3 టేబల్ స్పూన్స్

కొత్తమిర తురుము ------ కొద్దిగ

గ్రీన్ చిల్లీ ----- 3

అల్లం తురిమినది ----- 1 టీ స్పూన్

గసగసాలకు బదులు కోకనట్ పాలు 2 టేబల్ స్పూన్స్

రుచికి ఉప్పు , పసుపు

చేసే విధానం ::--

ముందు బెండి ని బాగా కడిగి నీళ్ళు లేకుండగ గుడ్డతో బాగా తుడిచి

చిటికిన వేలంట ముక్కలుగా కట్ చేసి వుంచండి


1

ష్టవ్ పై మూకుడు (బాణలి పాన్ )వుంచి కొద్దిగ నూనే పోసి

ఈ బెండి ని దోరగా వేయించి పక్కన ప్లేట్ లో వుంచండి

2


3




ఆనియన్ వెల్లుల్లి విడివిడిగా సన్నగా కట్ చేసి పక్కన వుంచండి

4



టోమాటోలు బాగాకడిగి ముక్కలుచేసి వుంచుకోండి

5



ష్టవ్ పై వున్న మూకుడులో కొద్దిగ గీ వేసి

6




కొద్దిగ కాగాక అందిలో వెల్లుల్లి ముక్కలు , అల్లం తురుము, వేసి

పచ్చివాసన పొయేవరకు వేయించి , ఆనియన్ ముక్కలు, వేసి

2 నిముషాలు వేయించి అందులోనే టోమాటో ముక్కలు, పసుపు , ఉప్పు , వేసి

గరం మసాల , డ్రై చిల్లీ పౌడర్, ధనియా పౌడర్, ఒక స్పూన్ పెరుగు వేసి కలిపి

పచ్చి మిర్చి రెండు చీలికలుగా కట్ చేసి వేసి

2 నిముషాలు మూతమూసి వుంచండి .

7




8


9




తరువాత అందులో కొబ్బెర పాలు వేసి బెండి వేసి

బాగా కలిపి ఒక్క నిముషం ష్టవ్ పై వుంచి దించేయండి

కమ్మటి బెండి మసాల తయార్ :)..............



(ఈజీ అని చెప్పి ఇంత పెద్దగా రాసానని భయపడకండి

వివరంగా రాయాలికదా అందుకే ఇంతపెద్దగా...రాసా :)

2 comments:

Madhavi Pavani said...

WOW......so tempting......nice recipe

AN UNKNOWN INDIAN said...

I'm trying this recipe today ..