కావలసిన పధార్థలు::-
బెండకాయలు.........100 గ్రాం
చిక్కుడుకాయలు....100 గ్రాం
ఆనియన్----------- 2 మిడియంసైజు
కరివేపాకు ఒక రెబ్బ
కొత్తమిర తురుము ..... మీకు కావలసినంత.
పోపు గింజలు::-
శనగపప్పు...ఉద్దిపప్పు...జిలకర...ఆవాలు.నూనె తగినంత..ఉప్పు...పసుపు
మసాల తయారికి కావలసినవి::-
పచ్చిమిర్చి---- 3
పప్పులు---------- 25 గ్రాంస్
చింతపండు------ రసం రెండు టేబల్‌స్పూన్స్
జిలకర--------- 1 టీస్పూన్
ధనియాపౌడర్--- 1 టీస్పూన్
పచ్చికొబ్బర--- తురుము 2 టెబల్‌స్పూన్స్
అన్ని కలిపి పచ్చివి నున్నగా కాస్త నీళ్ళగా గ్రైండ్ చేసి ఉంచండి
కూర చేసే విధానం::-
చిక్కుడు కాయలు....బెండకాయలు....అన్ని నీళ్ళతో బాగా కడిగి మీకు కావలసిన సైజులో కట్ చేసి ఉంచండి.
స్టవ్ పై పాన్ పెట్టి పాన్ వేడి అయినాక అందులో 3 స్పూన్స్ నూనె వేసి అందులో ఈ పోపుగింజలు వేసి...బాగా దోరగా వేగాక అందులో పచ్చిమిర్చి...కరివేపాకు...ఆనియన్ ముక్కలు వేసి అవికూడా గోల్డేన్ రంగు వచ్చే వరకు వేయించండి
ఆ తరువాత అందులో ఈ చిక్కుడు...బెండకాయ ముక్కలు వేసి అందులో పసుపు...ఉప్పు...వేసి బాగా కలయ బెట్టి సగం గ్లాసు నీళ్ళుపోసి అందులో ఈ మసాలకూడవేసి అంతా మళ్ళి ఒకసారి బాగా కలియబెట్టి పాన్ పై మూత పెట్టి 20 నిముషాలు సన్నటి సెగపై ఉడికించండి
బాగా ఉడికిన కూరలో కొత్తమీర వేసి దించేయడమే...ఘుమఘుమలాడే చిక్కుడు మసాల కూర తయార్......ఈ కూర చపాతికి కాని జొన్న రొట్టెకుగాని వేడి వేడి అన్నానికి గాని సూపర్ గా ఉంటుంది......మీరు తయారు చేసి చూస్తారా మరి?
నచ్చితే ఒక్క కామెంట్ ఇవ్వండి దోస్తులూ...
No comments:
Post a Comment