Wednesday, August 30, 2017


పచ్చికొబ్బర మావిడికాయ పచ్చడి

medium size మావిడికాయ పుల్లగా ఉంటే ఒకటి..పుల్లగ లేకుంటే రెండు వేసుకొండి


మావిడికాయ----- 1
పచ్చికొబ్బర--- సగం చిప్ప (తురిమి పెట్టుకొండి)
మెంతులు---------- 1/2 స్పూన్
ఆవాలు----------- 1 స్పూన్
ఎండుమిర్చి------- 15 లేక 20( కారం తగినంత)
ఇంగువ----------- 1/4 స్పూన్
పసుపు----------- 1/4 టీ స్పూన్ 
ఉప్పు...రుచికి తగినంత
నూనె..........తగినంత
బెల్లం......... 1/4 స్పూన్ 

:::తిరుగువాతకు కావలసినవి:::

మినపప్పు..శనగపప్పు..ఆవాలు..జిలకర్ర..ఎండుమిర్చి..ఇంగువ. 

పచ్చడి చేసేవిధానము::

1::మావిడికాయలు బాగా కడిగి పై పొట్టు పీల్ చేసి ముక్కలు చేసి ఉంచండి.

2:: కొబ్బర తురిమి ఉంచుకొండి.

3:: పాన్ లో 1/4 స్పూన్ నూనె వేసి అందులో పించ్ ఇంగువ వేసి మెంతులు,,ఎండుమిర్చి,,వేయించి పెట్టుకొండి.

4:: ఆవాలు పచ్చివి ఉంచుకొండి.

5:: ఇప్పుడు వేయించిన మెంతులు,,ఎండుమిర్చి,,పచ్చి ఆవాలు,,ఉప్పు,,పసుపు,,బెల్లం,,కొబ్బరకోరు,,మావిడికాయ ముక్కలు...అన్ని  mixie jar లో వేసి grind చేసుకోండి...నీళ్ళు వేయకుండగా చేయాలి.
ఆ తరువాత జార్ లోనుండి పచ్చడి తీసి గిన్నెలో వేసుకొని...తిరుగువాత పెట్టండి.

6:: కడాయిలో 3 స్పూన్స్ నూనె వేసి నూనె కాగినాక అందులో తిరుగువాత గింజలు వేసి అవి దోరగా వేగాక ఎండుమిర్చి చివర్లో వేసి కొద్దిగ ఇంగువ వేసి ఆ తిరుగువాతను పచ్చడిలో వేసి కలిపి...... 
వేడి వేడి అన్నానికి కలుపుకొని తింటే నాసామిరంగా... మళ్ళీ నాలుగు ముక్కలు ఎక్కువగా లాగించేస్తారు సుమా.....

No comments: