Wednesday, April 29, 2009

మినప పొట్టుతో వడియాలు--(Urad Pappad)


!! కావలసినవి !!

మినపప్పు -- 1 కప్పు

మినప పొట్టు -- 3 కప్పులు

జీర -- 1/2 టేబల్‌స్పూన్

ఇంగువ -- 1/4 టీ స్పూన్

పచ్చిమిర్చి -- 12
ఉప్పు తగినంత



!! తయారుచేసే విధానము !!

ముందుగా మినపప్పుని మెత్తగా రుబ్బాలి.

తరవాత మినప పొట్టు,ఉప్పు,పచ్చిమిర్చి,జిలకర్ర,ఇంగువ వేసి కొద్దిగా నీళ్లు పోసి (బరకగా)రుబ్బాలి.

మినప వడియాల మాదిరిగానే ప్లాస్టిక్ కవర్‌మీద సరిపడా సైజులో పెట్టుకోవాలి.

నూనెలో వేయించి తీస్తే మాంచి వాసనతో ఘుమఘుమలాడుతూ వుంటాయి.

కరకరలాడే వీటిని వేడి వేడి అన్నంలో నేతిలో కలుపుకుని తింటే చాలా బాగుంటాయి.

మరి మీరూ చేసి రుచి చూస్తారా ? ....
ఈ ఐటం విజయవాడ..వైజాగ్ వారికి ఇష్టమైన వంటకం :)


No comments: