Wednesday, April 20, 2011

పెసరపప్పు మామిడికాయ పచ్చడి













కావలసినవి::

నానపెట్టిన పెసరపప్పు::: 4 టేబల్‌స్పూన్స్
పచ్చిమామిడికాయ కట్ చేసినవి:::1 కప్
ధనియ:::1/2 టేబల్‌స్పూన్
ఎండుమిర్చి:::6
వెల్లుల్లి రెబ్బలు :::2( ఇదికావాలంటే వేసుకోవచ్చు లేకుంటే లేదు)
ఉద్దిపప్పు:::1/2 టేబల్‌స్పూన్ (మినపప్పు)
ఆవాలు::::1/2 టేబల్‌స్పూన్ 
మెంతి గింజలు:::1/3 టీస్పూన్
కొత్తమీర:: ఒక కట్ట
నూనె:::సరిపడేంత
ఉప్పు,పసుపు:::రుచికి తగ్గత్లు 

తాళింపుకు కావలసినవి::

చనగపప్పు::: 1/2 టీస్పూన్ 
ఆవాలు::::::::: 1/2 టీస్పూన్ 
జిలకర::::::: 1/3 టీస్పూన్
ఉద్దిపప్పు:::::: 1/2 టీస్పూన్
ఎండుమిర్చి::::: 2
ఇంగువ రెండు చిటికెలు
కరివేపాకు:::: 2 రెబ్బలు
నూనె సరిపడినంత

చేసే విధానం:: 

ముందు ష్టవ్ పై పాన్ పెట్టి కాస్త నూనె వేసి వేడి అయిన తరువాత  
ధనియాలు,మెంతులు,ఉద్దుపప్పు,ఎండుమిర్చి ఆవాలు, వేయించుకొని
దోరగా వేయించాలి...వేయించిన వాటిని ఒక ప్లేట్ లోకి తీసి 
పక్కనుంచండి.

కొత్తమీర బాగా కడిగి సన్నగా తరిగి ఉంచుకోండి.

ఈ నానపెట్టి ఉంచిన పెసరపప్పు నీళ్ళు వడగట్టి ఉంచుకోండి.

అదే పాన్లో కాస్త నూనె వేసి మామిడికాయ ముక్కలు లైట్ గా వేయించి


ముందు వేయించిన ఉంచిన వాటిని ఈ మామిడికాయ ముక్కల్ని తరిగిన కొత్తమీర 

పెసరపప్పు, గ్రైండర్ లో మెత్తగా చేసుకొని ఒక గిన్నెలో తీసి ఉంచండి.

అదే పాన్లో ఒక స్పూన్ నూనె వేసి తాళింపు గింజలన్నీ వేసి ఇంగువ కరివేపాకు తోపాటు   
ఎండుమిర్చి ముక్కలు వేసి దోరగా వేయించి చట్నిలో కలిపి వేడి వేడి అన్నంతో తినండి  
అధిరిపోయిందని మీరే చెపుతారు :) 

( వెల్లుల్లి పాయలు కావాలంటే ఇంగువ వేసే బదులు వెల్లుల్లి వేసి వేయించాలి ) 


No comments: