Friday, February 20, 2009

!! స్వీట్ పూరీ !!



!! స్వీట్ పూరీ !!

దీన్నే మడత పూరీ అనికూడ అంటారు :)

కావలసినవి !!

మైదాపిండి -- 500 గ్రా

పంచదార -- 250 గ్రా

యాలకులు -- 8

నెయ్యి -- వేయించడానికి సరిపడా

ఫుడ్ కలర్ --- చిటికెడు

!! చేసే విధానం !!

ముందుగా మైదాపిండి లో వంద గ్రాముల నెయ్యి కలిపి

ఆపై నీళ్ళు చల్లి ముద్దలా చేయాలి.

మైదా ముద్దను రెండు భాగాలుగా చేసి ఒక దానిలో ఫుడ్‌కలర్ కలపాలి.

ఈ రెండు రకాల ముద్దల్ని విడి విడిగా చపాతీలా చేయాలి.

ఇప్పుడు మామూలు చపాతిమీద రంగు చపాతి ఉంచి వీటిని చాపలా చుట్టాలి.

ఈ రోల్ను చాకుతో ముక్కలుగా కోసి,ఒక్కో ముక్కను మళ్ళీ పూరీలా ఒత్తి

నేతిలో కరకరలాడేలా వేయించాలి.

చక్కర ,యాలకులు కలిపి మెత్తగా పొడిలా చేయాలి.

ఈ పోడిని వేయించిన పూరీలమీద బాగా చల్లి...అంతే...స్వీట్ పూరీ తయార్....
మీరు రెడినా...

No comments: