Friday, February 20, 2009

మైసూర్ పాక్


!! మైసూర్ పాక్ !!

!! కావలసినవి !!

శనగపిండి --1 కప్
పంచదార -- 2 1/2 లేక 3 కప్పులు
ఈలాచి -- 4 ( పొడి చేసుకోవాలి )
నెయ్యి,బట్టర్ -- 1 1/2 కప్
వంట సోడా - 1/2 టేబల్ స్పూన్

!! చేసే విధానం !!

శనగపిండినీ దోరగా వేయించాలి (తక్కువ మంట మీద వేయించాలి)

చక్కర లో 1 గ్లాస్ నీళ్ళు పోసి పాకం పెట్టాలి ।
పాకం జిగురుగా వుండాలి అంటె రెండు వేళ్ళతో చుస్తె అది తీగలా సాగుతున్నట్టు వుండాలి.

ఇప్పుడు ఆ పాకంనీ తక్కువ మంటలో పెట్టి అందులో వేపిన శనగపిండినీ ,ఈలాచి పొడినీ కలపాలి

ఇప్పుడు కొంచెం నెయ్యినీ ,బట్టర్ నీ ( కరగబెట్టినది ) అందులో వేసి కలపుతూ వుండాలి

ఒక 10 నిమషాలు పాటు దానిని అలాగే కలుపుతూ వుందాలి

అందులో సోడానీ వేసి కలపాలి .ఇప్పుడు గరిటికి అంటుకొకుండా వుండెవరకు కలుపుతూ వుంచాలి

ఒక ప్లెటులో నెయ్యిని రాసి దానిలో ఆ మైసూర్ పాక్ మిశ్రమాన్ని వేసి అది వేడి వునప్పుడే ముక్కలుగా కట్ చేసుకోవాలి

మైసూర్ పాక్ తయార్...మీరూ చేసి చూడండి :)

No comments: