Thursday, June 11, 2009

పనీర్ ఫ్రైడ్ రైస్


!! కావలసినవి !!

పన్నీర్ ముక్కలు -- 200 గ్రాం

బాస్మతి రైస్ -- 500 గ్రాం

నూనె -- 60 గ్రాం

పచ్చిబఠాణి -- 35 గ్రాం

జీడిపప్పు -- 30 గ్రాం

పచ్చి కొబ్బరి తురుము -- 1/2 కప్పు

క్యారట్ తురుము -- 1/4 కప్పు

ఉల్లికాడల తురుము -- 1/4 కప్పు

చిల్లీ సాస్ -- 1 టీస్పూన్

టొమాటో సాస్ -- 1.5 టీస్పూన్

అల్లం వెల్లుల్లి ముద్ద -- 1.5 టీస్పూన్

గరం మసాలా పొడి -- 1/2 టీస్పూన్

మిరియాలపొడి -- 1/2 టీస్పూన్

!! చేసే పద్ధతి !!

ఒక మూకుడు లో కొద్దిగా నూనె వేడి చేసి ముక్కలుగా కోసిన పన్నీర్ ముక్కలు,జీడిపప్పులు వేయించి పక్కన పెట్టుకోవాలి.

బియ్యం కడిగి కాస్త పొడిపొడిగా వండి పెట్టుకోవాలి.బాణలి లో నూనె వేసి అల్లం వెల్లుల్లి ముద్ద వేసి పచ్చి వాసన పోయేవరకు వేయించాలి.


ఉల్లికాడల తురుము,పచ్చిబఠానీలు,క్యారట్ తురుము వేసి కలిపి కొద్దిగా వేయించాలి.

చిల్లీసాస్,టోమాటో సాస్,మిరియాల పొడి,గరం మసాలా పొడి,తగినంత ఉప్పు వేసి బాగా కలపాలి.

ఇందులోనే పన్నీర్ ముక్కలు,జీడిపప్పు ముక్కలు,బిరుసుగా వండిన అన్నం వేసి అన్నీ బాగా కలియబెట్టాలి.

చివరగా తురిమిన కొత్తిమిర,కొబ్బరి కూడా వేసి 1 నిమిషం ఉంచి దింపేయాలి.

10 నిముషాలు అలానే ఉంచి ఆ తర్వాత వడ్డించేయడమే...

No comments: