Thursday, June 11, 2009
వంకాయ పచ్చికారం
!! కావలసినవి !!
వంకాయలు --- 1/2 కిలో
నూనె --- 1 కప్పు
ఉప్పు , రుచికి తగినంత
పసుపు , చిటికెడు
అల్లం ముక్క , గోలికాయంత
పచ్చి మిర్చి --- 6
ధనియాలు --- 1 చెంచా
జిలకర్ర --- చిన్న చెంచా
వెల్లుల్లి --- 6
కొత్తిమిర తరుగు --- 1 కట్ట
!! తయారు చేసే విధానం !!
ముందుగా ధనియాలు,జిలకర్ర,అల్లం,పచ్చి మిర్చి వెల్లుల్లి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.
వంకాయలు చిన్న ముక్కలుగా చేసుకోవాలి.
బాణలి వేడి చేసి అందులో నూనె మూడు వంతులు పోసి నునె వేడెక్కగానే
ముక్కలు వేసి 5 నిమిషాలు మూతపెట్టి వుంచాలి.
తర్వాత ముక్కలు మాడకుండగా కలుపుతూ , ఉప్పు , పసుపు , చల్లి మళ్ళీ బాగా కలపాలి.
వంకాయ ముక్కలు పూర్తిగా వేగినట్లు తెలియగానే పచ్చికారం ముద్ద వేసి బాగా కలపాలి.
వంకాయ ముద్దపై కొత్తమిర చల్లి వేడి వేడి గా వడ్డించడమే....
ఘుమ ఘుమ లాడే వంకాయ పచ్చికారం , చపాతి , రొట్టెల్లోకి , అన్నానికి భలే కమ్మాగా వుంటుంది.
కావాలంటే చనగపప్పు,మినపప్పు,జిలకర్ర,
ఆవాలు ఎండి మిర్చితో పైన పోపు వేసుకోవచ్చు .
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment