Saturday, April 27, 2013

ఆపిల్స్ తో పచ్చడి


















కావలసినవి::

2:: ఆపిల్స్  ముక్కలు చేసి ఉంచండి

15: పచ్చి మిర్చి.

పచ్చికొబ్బర  2  టేబల్‌స్పూన్స్.

జిలకర్ర  1/2  టీస్పూన్

ఉప్పు,పసుపు,తగినంత


పోపు దినుసులు::

ఆవాలు...చనగపప్పు...మినపప్పు...జిలకర్ర...ఎండుమిర్చి...
నూనె ఒక స్పూన్....ఒక పించ్ ఇంగువ...కరివేపాకు ఒక రెబ్బ.   
{ అన్నీ కలిపి ఒక టేబల్‌స్పూన్ ఉండాలి  }
ముందు పైన చెప్పినవన్నీ మిక్సిలో వేసి బాగా గ్రైండ్ చేసి 
ఒక బౌలో వేసి ఉంచండి.

ఆ తరువాత ష్టవ్ పై బాణలి పెట్టి ఒక స్పూన్ నూనె వేసి

నూనె కాగాక పొపు దినిసులన్నీ వేసి చివర్లో ఇంగువ కరివేపాకు వేసి

అన్ని దోరగా వేగిన తరువాత ఈ చేసి ఉంచిన పచ్చడిలో కలపండి

ఘుమ ఘుమ లాడే ఆపిల్ పచ్చడి రెడి :) 

Friday, April 26, 2013

ఓట్స్ దోసలు























కావలసినవి::

ఓట్స్:::: ఒకటిన్నర కప్....
పచ్చిమిర్చి 4....
ఆనియన్ 2 ....
జిలకర్ర 1/2 టీస్పూన్
 ఉప్పు తగినంత....
కొత్తిమీర సన్నగా కట్ చెసినది ఒకటిన్నర టేబల్‌స్పూన్....
నూనె 2 టేబల్‌స్పూన్.....
అల్లం  1/2  టేబల్‌స్పూన్...

(పుల్ల పెరుగు లేక మజ్జిగ ఐనా ఒకే ) 1/2 కప్ .


చేసేవిధానము::











ముందు ఓట్స్ ని ఒక బౌల్లో వేసి అందులో పెరుగు నీళ్ళు కలిపి

మన దోసపిండిలా జారుగా చేసి ఓ అరగంట నాననివ్వండి.

ఆ తరువాత పచ్చిమిర్చి....ఆనియన్....కొత్తిమీర....అల్లం ముక్కలు...అన్నీ సన్నగా తరిగి

ఈ దోసపిండి బౌల్లో వేయండి, .... దానితో పాటు జిలకర్ర....ఉప్పు....వేసి












బాగా కలిపి....దోసపెన్నం ష్టవ్ పై పెట్టి పెన్నం వేడి అయిన తరువాత

పెన్నానికి నూనె రాసి....దోసపిండి పాన్ పై వేసి...

పాన్ పై ఉన్న దోసపిండిపై నూనె కొద్దిగ వేసి...అటు ఇటు బాగా దోరగా కాల్చి

దోసలు చేయటమే...కమ్మగా....పుల్ల పుల్లగా....ఉండే ఓట్స్ దోసలు....రెడి 







Tuesday, April 23, 2013

కొత్తిమీర పచ్చడి















కొత్తిమీర పచ్చడి

ఈ కొత్తిమీర పచ్చడి 20 రోజులు నిలువ వుంటుంది. 
  

కావలిసినవి:: 

కొత్తిమీర::::::::::::  1 కట్ట పెద్దది
ఎండుమిర్చి::::::::  12 
చింతపండుగుజ్జు:::  4 టేబల్‌స్పూన్స్

తాలింపు గింజలు::  

శనగ పప్పు::::::   2 టీస్పూన్ 
మినపపప్పు::::::  1 టీస్పూన్
ఆవాలు:::::::::::   1/3 టీస్పూన్ 
జీలకర్ర::::::::::::   1/ 3 టీస్పూన్
నూనె:::::::::::::   5 టేబల్‌స్పూన్స్ 
ఇంగువ:::::::::::  1/2టీస్పూన్
ఎండుమిర్చి::::::  
పసుపు..తగినంత
ఉప్పు..తగినంత 


పచ్చడి చేసే విధానము::

కొత్తిమీర  కడిగి చిల్లుల గిన్నలో  వేసి బాగా కడగాలి.   
తరువాత మిక్సీ జార్ లో , కొత్తిమీర ,
ఉప్పు..ఎండుమిర్చి..చింతపండు గుజ్జు వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసి ఉంచండి.   

stove మీద పాన్ పెట్టి తగినంత నూనె వేసుకొని నూనె కాగినాక,
తాళింపు గింజలు ఎండుమిర్చి ఇంగువాతో పోపు పెట్టి,

ఈ గ్రైండ్ చేసి ఉంచిన పచ్చడి పోపు లో వేసి 5 నిముషాలు
సన్నటి మంటపై వేగనిచ్చి stove  కట్టేయండి.

టైట్ గా  మూత ఉన్న జార్ తీసుకొని అందులో వేసి ఉంచండి

20 రోజులవరకూ చెడిపోకుండా ఉంటుంది( నీళ్ళు తగలనివ్వకండి)

ఈ పచ్చడి వేడి వేడి అన్నానికిగాని..చపాతి,దోస,ఉప్మా..అన్నింటికీ బాగుంటుంది

మరి మీరు రెడినా? 


Sunday, April 14, 2013

మీకు రాత్రి నిద్దర పట్టటం లేదా?

















మీకు రాత్రి నిద్దర పట్టటం లేదా?

(పడుకొనే ముందు కొబ్బరి నూనెతో కాని , ఆముదం నూనెతో కాని 
అరికాళ్ళకు రాసి మర్ధన చేస్తే బాగా సుఖమైన నిద్ర పడుతుంది) 

మామిడికాయ ఊరగాయ (Pickle - పికల్)





మామిడికాయలు:: 2
ఆవాలపొడి::::::::: 3 టేబల్‌స్పూన్
మెంతులపొడి:::::: 2 టేబల్‌స్పూన్
ఎండుకారంపొడి:::: 3 టేబల్‌స్పూన్
ఉప్పు::::::::::::::  3 టేబల్‌స్పూన్
పసుపు:::::::::::: 1/2 టీస్పూన్

పోపుకు కావలసినవి::

ఆవాలు:::::::::::  1 టీస్పూన్ 
ఎండుమిర్చి::::::: 4
వెల్లుల్లి దబ్బలు::: 6
ఇంగువ:::::: తగినంత

కరివేపాకు రెండు రెమ్మలు

ముందు మాంచి మామిడికాయలు తీసుకొని 
వాటిని బాగా కడిగి తుడిచి ముక్కలుగా కట్ చేసుకొని 
ఆ ముక్కలను ఎండలో ఓ గంట ఎండబెట్టాలి. 

ఆవాలు..మెంతులు, దోరగా నూనె వేయకుండగ వేయించుకొని
విడి విడిగా పొడి చేసి ఉంచుకొండి.

ముక్కలు చేసి ఉంచిన మామిడికాయల్లో
ఈ ఆవపొడి,మెంతిపొడి,ఎండుమిర్చిపొడి,
ఉప్పు పసుపు వేసి, అన్ని కలిసిపోయేలా బాగా కలిపి

అందులో పోపు వేసి..వేడి..వేడి అన్నానికి కలుపుకొని తింటే
వావ్ అనకుండ ఉండలేరు..మీరూ Try చేసి చూడండి      

{వెల్లుల్లి కావాలంటే వేసుకోవచ్చు లేకుంటేలేదు}  

మామిడి కాయ ఇడ్లిపిండి పునుగులు






















మామిడికాయ తురుము..1/2 కప్పు
ఇడ్లి పిండి........................2 కప్పులు
జిలకర............................1/3 టీస్పూన్ 
పచ్చిమిర్చి......................4  
కరివేపాకు........................2 రెబ్బలు
కొత్తమీర..........................1 టేబల్‌స్పూన్ తరిగినది
వంటసోడ.........................1/4 టీస్పూన్ 
 నూనె..............................వేయించేందుకు కావలసినంత 
ఉప్పు తగినంత


మిగిలి పోయిన ఇడ్లిపిండికానివ్వండి..లేక ఫ్రేష్‌గా ఉన్న ఇడ్లిపిండైనా ఒకే 
(పిండి పుల్లగా ఉండకూడదు) 

అందులో పచ్చిమిర్చి ముక్కలు చేసి వేసుకొని..
{కారం ఎక్కువకావాలన్నా,తక్కువ కావాలన్నా మీరు చూసుకొని వేసుకోవచ్చు}

కరివేపాకుని,కొత్తమీరని సన్నగా తరిగి వేసి.. 
మామిడి తురుము,జిలకర్ర,వంటసోడ,ఉప్పు,వేసి బాగాకలిపి 

కాగుతున్న నూనెలో ఈ పిండిని పునుగులుగా వేసి దోరగా వేయించిన తరువాత
చిల్లుల గరిటతో తీసి వేడి వేడి గా వడ్డించవచ్చు..

10: నిముషల్లో అయిపోయే ఈ స్నాక్ ఇడ్లి పిండి మిగిలినప్పుడు కాని 

లేక ఫ్రేష్‌గా కాని చేసుకోవచ్చును

మరి మీరూ ఈ మామిడికాయ పునుగులు చేసి రుచి చూస్తారా?
(ఇడ్లిపిండి ఎక్కువ జారుగా ఉంటే  కాస్త మైదాపిండి కలుపుకోవచ్చు ) 

******************************************************************************

Friday, August 03, 2012

రవ ఇడ్లీ + టోమాటో చట్ని






1)


రవ ఇడ్లీ + టోమాటో చట్ని


కావలసినవి::>


అంగట్లో కొనకుండగా మనమే ఇంట్లో చేసుకోవచ్చు :)

చిక్కటి పెరుగు ---- 1 గ్లాసు

రవ --- ---ఒకటిన్నర గ్లాసు

కొత్తమీర-----ఒక కట్ట

తిరుగువాతకు కావలసినవి

ఆవాలు-----------1 /2 స్పూన్

జీలకర్ర-----------1 /4 స్పూన్

శనగపప్పు--------1 /2

మినపప్పు--------1 /2

ఎండుమిర్చి-------2

కరివేపాకు రెబ్బలు--2
జీడిపప్పు------- 7

నెయ్యి----------1 /2 టేబల్ స్పూన్

నీళ్ళు----------1 గ్లాసులు

చేసే విధానం::>

2)


1 ) కళాయిలో నెయ్యివేసి అందులో జీడిపప్పు వేయించి పక్కన పెట్టండి.
మిగిలిన నేతిలో శనగపప్పు,ఉద్డుపప్పు,ఆవాలు,జీలకర్ర,ఇంగువ ఎండుమిర్చి,వేసి దోరగా వేయించి
అ తిరుగువాతలోనే రవ వేసి బాగా లైట్ బ్రవున్ కలర్ వచ్చే వరకు చిన్న సెగాపైన వేయించి పక్కన పెట్టుకోండి .

3)


2 )మట్టి లేకుండా బాగా కడిగి సన్నగా తరిగిన కొత్తమీర -- గ్లాసుడు పెరుగు -- ఉప్పు తగినంత --
కరివేపాకు -- ఆ రవలో వేసి -- నీళ్ళుపోసి ఇడ్లి పిండిలా చిక్కాగా కలుపుకోవాలి .----


4)


3) 15 నిముషాలు బాగా నానిన తరువాత (జున్నులా పోళ పోళ గా ఉంటుంది చుడ్డానికి )--
ఈ మిశ్రమాన్ని ఇడ్లి ప్లేట్లపై -- వేసి ష్టవ్ పై పెట్టేదే ఇడ్లి కుక్కర్ లో నీళ్ళు రెండు గ్లాసులు వేసి పెట్టండి .

5)

4)ఆవిరిపై ఉడికే ఈ రవ ఇడ్లీలు చుడ్డానికి --- తినడానికి --- మాంచి టెష్ట్ గా ఉంటాయి మరి మీరు రెడిఎనా ?? ...


6)






మీకు నే చేసిన ఈ రవ ఇడ్లీలు నచ్చితే ఒక్క కామెంట్ ఇవ్వండి....
మీ కామెంట్స్ ... మీ ఫాలోవోవర్స్ నాకు మళ్ళి రెసిపీలు వేయాలనిపించేది ..
శ్రద్ధగా చదివి మీరు నేర్చుకోండి అంగట్లో రవ ఇడ్లి కొనకుండగా మనమే చేసుకోవచ్చు.



టోమాటో చట్ని >>>>

1)


2)


టోమాటో చట్ని

ఆనియన్...2

టోమాటో...3

ఎండుకారం..2టీస్పూన్స్

నూనె........1టేబల్‌స్పూన్

చక్కర....1/4 ( కన్న తక్కువ)

ఉప్పు తగినంత


చేసే విధానం:::

ఆనియన్ పొట్టుతీసి సన్నగ తరుక్కోని ఉంచండి

3)

టోమాటో కూడా సన్నగా తరుక్కోని ఉంచండి

ఇప్పుడు మూకుడులో నూనె వేసి ష్టవ్ పై ఉంచి

నూనె కాగాక అందులో తరిగిన ఆనియన్ వేసి

4)

2 మినిట్స్ వేగనిచ్చి .. అందులోనే టోమాటో ముక్కలు వేసి

ఉప్పు వేసి..పంచదార వేసి మెత్తగ ఉడికించాలి

బాగా ఉండికిన తరువాత అందులో ఎండుమెరపొడి వేసి కలయ బెట్టి

ఇడ్లితో పాటు స్వర్వ్ చేసేదే...రవ ఇడ్లీ అండ్ టోమాటో చట్ని రెడీ



మీకు ఈ ఐటం నచ్చి ఉంటే నాకో కామెంట్ పెట్టండి థాంక్యూ :)