Wednesday, April 11, 2012

వెరైటీ సాంబర్



















వెరైటీ సాంబర్

ఈ వెరైటీ సాంబర్ అన్నానికీ..ఇడ్లీ,దోస అన్నింటికీ చాలా రుచిగా ఉంటుంది

ఈ సాంబర్కి కొద్దిగ పప్పుంటే చాలు అరగంటలో సాంబర్ చేసేయొచ్చు

కావలసిన పధార్తాలు::-


1)


















ఉడికిన కందిపప్పు.....1/2 కప్పు

సాంబర్ పౌడర్......... 3 స్పూన్స్

ధనియాలు..............1/2టేబల్ స్పూన్

పచ్చిమిర్చి...........2

ఉప్పు,పసుపు.............రుచికి

చింతపండు రసం.......2 టేబల్‌స్పూన్

కొత్తమిర...............1/4 కప్

కరివేపాకు.............2రెబ్బలు

కొద్దిగ బెల్లం..లేక చక్కర..1 టీస్పూన్

కొద్దిగ పచ్చి కొబ్బెర (కావాలంటేనే వెసుకోవచ్చు)


తాళింపుకు కావలసినవి::-

ఆవాలు

జిలకర్ర

ఎండుమిర్చి

ఇంగువ............అన్ని కలిపి 1/2 టేబల్‌స్పూన్


3)


















బీన్స్...................5

పొటాటో.................1

క్యారెట్.................1

టోమాటో.................3

ఆనియన్.................5

సొర్రకాయ(అనపకాయ) 10 ముక్కలు



సాంబర్ చేసే విధానం::-

1)ముందు వెజిటబల్స్ అన్ని నీళ్ళతో బాగా కడిగి ఉంచండి

2)తరువాత అన్ని కాయగూరలు మీకు కావలసిన సైజులో ముక్కలు చేసి ఉంచండి


3)సాంబర్ పౌడర్ ---- 1 ఆనియన్ ---- చింతపండు రసం ---- ధనయాలు ----

కొబ్బెర ----- కొత్తమీర ----అన్ని పచ్చివే గ్రైడ్ చేసి ఉంచండి


4) ష్టవ్ పై దట్టమైన గిన్నె పెట్టి అందులో ఒక గ్లాసు నీళ్ళుపోసి

ఈ తరిగిన వెజ్జి ముక్కలన్నీ అందులో వేసి కొద్దిగ ఉప్పువేసి ఓ 10 నిముషాలు ఉడికించండి


5) సగం సగం ఉడికిన వెజ్జి ముక్కల్లో పచ్చిమిర్చి 2 -- ఉడికిన పప్పు -- మసాల --

చక్కర -- ఉప్పు,పసుపు --- కరివేపాకు --- కొత్తమీర --- అన్ని వేసి ఇంకో గ్లాసు నీళ్ళుపోసి

4)

















15 నిముషాలు ఉడికించండి---- ఉడికిన సాంబర్లో ---- తాళింపు పెట్టి --- ష్టవ్ పైనుండి

దించేసి.....వేడి వేడి అన్నానికి గాని.....చపాతి...లేక...ఇడ్లి కి గాని ఎదైన సరే

వేసుకొని ఆరగించండి...........గుమ గుమ లాడే సాంబర్....రెడి........


5)



Thursday, March 22, 2012

శ్రీ నందన నామ సంవత్సర శుభాకాంక్షలు

★♫★♫★♫★♫★♫★♫★♫★♫★♫★♫★♫★♫♫★♫★♫★♫★♫★♫★♫♫★♫★♫♫★♫★♫
★♫★♫★♫★♫★♫★♫★♫★♫★♫★♫★♫★♫♫★♫★♫★♫★♫★♫★♫♫★♫★♫♫★♫★♫

SRI NANDANA♥…♥ NAAMA♥…♥ SAMVATSARA ♥…♥ SUBHAAKAANKSHALU ♥…♥


★♫★♫★♫★♫★♫★♫★♫★♫★♫★♫★♫★♫♫★♫★♫★♫★♫★♫★♫♫★♫★♫♫★♫★♫
★♫★♫★♫★♫★♫★♫★♫★♫★♫★♫★♫★♫♫★♫★♫★♫★♫★♫★♫♫★♫★♫♫★♫★♫

SRI NANDANA♥…♥ NAAMA♥…♥ SAMVATSARA ♥…♥ SUBHAAKAANKSHALU ♥…♥









★♫★♫★♫★♫★♫★♫★♫★♫★♫★♫★♫★♫♫★♫★♫★♫★♫★♫★♫♫★♫★♫♫★♫★♫
★♫★♫★♫★♫★♫★♫★♫★♫★♫★♫★♫★♫♫★♫★♫★♫★♫★♫★♫♫★♫★♫♫★♫★♫

SRI NANDANA♥…♥ NAAMA♥…♥ SAMVATSARA ♥…♥ SUBHAAKAANKSHALU ♥…♥

★♫★♫★♫★♫★♫★♫★♫★♫★♫★♫★♫★♫♫★♫★♫★♫★♫★♫★♫♫★♫★♫♫★♫★♫
★♫★♫★♫★♫★♫★♫★♫★♫★♫★♫★♫★♫♫★♫★♫★♫★♫★♫★♫♫★♫★♫♫★♫★♫

అందరికీ మిత్రులకీ..బంధువులకు..తదితరులకు అందరికీ..
ఉగాది..శ్రీ నందన నామ సంవత్సర శుభాకాంక్షలు

Wednesday, December 14, 2011

మైదా బియ్యం పిండి బొండాలు

7)


1)


కావలసినవి::-

బియ్యంపిండి---1 కప్పు
మైదపిండి----2 టేబల్‌స్పూన్
పచ్చిమిర్చి-2
అల్లం తురుము--1 టీ స్పూన్
ఆనియన్స్------1
జిలకర్ర-----1 టీ స్పూన్
పెరుగు--------1 కప్పు
కర్వేపాకు----1 రెబ్బ
కొత్తమీర----1టేబల్‌స్పూన్
ఉప్పు రుచికి తగినట్లు

చేసేవిధానం::

2)

ముందు బియ్యం పిండి..మైదాపిండి ఉప్పు..జిలకర్ర వేసికలపండి

అందులోనే..ఆనియన్..పచ్చిమిర్చి..కొత్తమీర..కర్వేపాకు.

సన్నగా తరిగి..అల్లం తురుము..పెరుగుతో పాటు

బియ్యంపిండిలో కలపండి..దోసపిండికన్నా చిక్కగా ఉండాలి.

3)

4)

5)

తరువాత పాన్లో నూనె వేసి నూనె కాగాక అందులో

ఈ బోండా పిండిని డిప్ చేయాలి బాగా దోరగా

బంగారు రంగు వచ్చేవరకు వేయించి (Fry)

6)


ప్లేట్ లో తెసి చిల్లిసాస్ తోకాని పుదిన సాస్ తో కాని

వేడి వేడి గా తింటే నాసామిరంగా...ఆహా..ఏమిరుచి..

7)

మరి ఆలస్యం ఎందుకు మధ్యనం టీ తో పాటు ఇవి రెండు తిన్నామంటే

యమ మజాగా ఉంటుంది సాటర్‌డే.. సన్‌డే... మీకోసం వేడి వేడిగా

వెజి పన్నీర్ మసాల




కావలసినవి::-


బీన్స్---------------------5
కాప్సికం------------------1
కారెట్--------------------1
పొటాటో------------------1
పనీర్--------------------200 గ్రాం
ఉల్లిపాయలు-------------2
టొమాటోలు-------------4
పచిమిర్చి---------------2
కొత్తమీర----------------1టేబల్‌స్పూన్
పెరుగు-----------------1 కప్
బేబికార్న్--------------5
పుదిన ఆకులు---------2టేబల్‌స్పూన్స్
కాలీఫ్లవర్--------------1 కప్ ముక్కలు చేసినవి
అల్లం వెల్లుల్లి-----------1టేబల్‌స్పూన్
కరివేపాకు-------------1 టేబల్‌స్పూన్
కారం-----------------1టేబల్‌స్పూన్
గరంమసాలా---------2టేబల్‌స్పూన్స్
నూనె----------------3 టేబల్‌స్పూన్స్
గీ-నెయ్యి------------2టేబల్‌స్పూన్స్
గసగసాలు-----------3 టేబల్‌స్పూన్స్
పసుపు,ఉప్పు.తగినంత

చేసే విధానం::--

1)గసగసాలు ఓ అరగంట నీళ్ళల్లో నానబెట్టండి.
వెజిటేబల్స్ అన్నీ నీళ్ళతో కడిగి..
మీకు కావలసిన సైజ్‌లో కట్ చేసి ఉంచుకోండి.

1)

2)పన్నీర్ చిన్న చిన్న ట్యుబ్స్ లా కట్చేసి ఉంచుకోండి.

2)

3)తర్వాత ఆనియన్..అల్లంజింజర్ పేష్ట్..పచ్చిమిర్చి..
గరం మసాల..పెరుగు..గసగసాలు..కారం..పుదిన..
2,టోమాటో..అన్నీ గ్రైండ్ చేసి ఉంచుకోండి.

3)

3)

4)ఇప్పుడు పాన్‌లో ఒక స్పూన్ నూనె వేసి..కూరలన్నీ
సగం ఉడికేట్లు చేసి..ప్లేట్ లో తీసి ఉంచండి.

4)

5)అదే పాన్ లో మళ్ళి నూనె వేసి..అందులో ఈ గ్రైండ్ చేసి ఉంచిన
గరం మసాల..ఉప్పు,పసుపు,వేసి..ష్టవ్ సింలో పెట్టి..
పచ్చివాసన పోయింత వరకు వేయించండి..

5)

5)

6)బాగా వేయించిన మసాలలో..టోమాటో..వేయించిన కూరగాయలు
కరివేపాకు..నెయ్యి..వేసి బాగా కలిపి
10:నిముషాలు ఉడికించి అందులొనే పన్నీర్‌ముక్కలు..
వేసి మళ్ళి..5.నిమిషాలు..ఉడికించి..కొత్తమీరతో డెకొరేట్ చేసి..సర్వ్ చేయడమే.

6)



.ఘుమఘుమలాడే..వెజీ..పన్నీర్..మసాల..తయార్..

Monday, May 30, 2011

గులాబ్‌జామున్ ( gulab jamun )






కావలసినవి::----

( గులాబ్‌జామున్ MTR powder )

గులాబ్‌జామున్-------- 2 కప్పులు

చల్లటి పాలు----------- 1/2 కప్పు

చక్కర---------------- 2 కప్పు

నీళ్ళు----------------- 3 కప్పులు

నెయ్యి---------------- 200 గ్రా

ఏలక్కులపొడి--------- 1 టీ స్పూన్

చేసేవిధానం::---




ముందు గులాబ్‌జామున్ పౌడర్ని చల్లటి పాలతో

గట్టిగా కలిపి బాగా kneading చేయాలి.

చేసిన తరువాత ఒక అరగంట నానేసి ఉంచండి.

తరువాత మీరు పిండి నానెంతలో చక్కరపాకం చేసి

ఉంచుకోండి.

చక్కర ను నీళ్ళల్లో కలిపి చక్కర కరిగెంత వరకు నీళ్ళను మరగనివ్వాలి.

పది నిముషాలు పాటు మరగ నివ్వాలి. ఈ పాకం వేడి గా ఉండేలా చూసుకోండి.







ఇప్పుడు నానిన గులాబ్ జామున్ పిండిని చిన్న చిన్న balls లా

చేసుకొని పక్కన ష్టవ్ పై మూకుడు ఉంచి అందులో నెయ్యివేసి

నెయ్యి కరిగి వేడి అయిన తరువాత అందులో ఈ గులాబ్ జామున్ బాల్స్ ని

ఒక్కొక్కటిగా వేస్తూ దోరగా వేయించి వేగిన తరువాత వాటిని

ఈ చేసిపెట్టుకొన్న పాకంలో వేసి 15 నిముషాలు నాననివ్వండి

ఇప్పుడు చూసారా గులాబ్ జామున్స్ ఎలా వున్నాయో ??!!!!





మరి మీరూ తయారా?

మజ్జిగ పులుసు (Majjiga Pulusu)






దోసకాయ..బెండకాయ..సీమవంకాయ..సొర్రకాయ(అనపకాయ)
పొట్లకాయ..ఉద్దిపప్పు వడలు.. బచ్చలికూర..ఇలా మనకు నచ్చిన
కాయగూరలతో మజ్జిగ పులుసు చేసుకోవచ్చు

(చనగపప్పుకు బదులు కందిపప్పు )

కావలసిన పదార్థాలు:::

దోసకాయలు ---- 2

నానేసిన కందిపప్పు ----- 1/2 కప్పు

చిక్కటి పెరుగు ----- 2 కప్పులు

అల్లం తురుము ----- 1 టీ స్పూన్

పచ్చిమిర్చి ----- 3

జిలకర్ర ------ 1/2 స్పూన్

ఆవాలు ----- 1 స్పూన్

పచ్చి కొబ్బర కోరు -- 2 టేబల్ స్పూన్స్

కరివేపాకు 2 రెబ్బలు

పసుపు---ఉప్పు---రుచికి తగినట్లు

నూనె 2 టేబల్ స్పూన్స్

పోపు గింజలు --- ఆవాలు---జిలకర్ర---ఎండుమిర్చి---ఇంగువ.


చేసేవిధానము::




ముందు దోసకాయలు పొట్టు పీల్చేసి మీకు కావలసిన సైజులో

ముక్కలుగా కట్‌చేసి ష్టవ్ పై మందపాటి గిన్నె ఉంచి

అందులో ఒక స్పూన్ నూనె వేసి ఈ తరిగిన దోసకాయముక్కల్ని

అందులో వేసి కొద్దిగా ఉప్పువేసి(మజ్జిగలో మళ్ళి వేస్తారు కాబట్టి

చూసుకొని ఉప్పు వేసుకోండి)ఉడికించి పెట్టుకోండి.




పెరుగునులో ఒక గ్లాసు నీళ్ళు వేసి మజ్జిగలా చిలగొట్టుకొని

పసుపు..ఉప్పు..వేసి ఉంచండి.





నానిన కంది పప్పు అల్లం..జిలకర్ర..ఆవాలు..

పచ్చికొబ్బర..కొత్తమీర..

అన్నీ గ్రైండ్ చేసుకొని.. ఆ మసాలను మజ్జిగలో కలిపి

ఉడికిన దోసకాయ ముక్కలు..కరివేపాకు..వేసి ఒక్క ఉడుకు

ఉడికించండి.

తరువాత..ష్టవ్ పై చిన్న మూకుడు ఉంచి..అందులో

ఒక్క స్పూన్ నూనె వేసి ఆవాలు,జిలకర్ర,ఎండుమిర్చి,ఇంగువ వేసి

మజ్జిగ పులుసులో కలిపి కొత్తమీర వేసి మూతమూయండి

వేడి వేడి అన్నానికి మజ్జిగపులుసు

అప్పడాలతో నంజుకొనితింటే..ఆహా..భలే రుచి :)

ఇలాగే ఉద్దిపప్పు వదలతోకూడ వడలు చేసి
దోసకాయకు బదులు వడలు వేసి 20 నిముషాలు
నానేసిన తరువాత తింటే చాలాబాగుంటాయి

Wednesday, May 04, 2011

బియ్యపురొట్టె :::Rice Flour Roti :::



1)


2)

కావలసిన పదార్థాలు::-

బియ్యంపిండి......... 1/2 కిలో

పచ్చిమిర్చి......... 4

కొత్తమీర...కరివేపాకు
(సన్నగా తరిగినది........3 టేబల్‌స్పూన్స్

ఆనియన్........ ....2...

(సన్నగా Chop చేసుకొని వుంచుకోండి)

జిలకర్ర.......1 టీ స్పూన్

ఉప్పు...ఇంగువ...నూనె...నీళ్ళు...అన్నీ తగినంత


రొట్టె చేసే విధానం::

3)


బియ్యంపిండి పురుగులేకుండగా జల్లించి

ఒక గిన్నెలో వేసి వుంచండి.

ఆ బియ్యం పిండిలో సన్నగా chop చేసిన ఆనియన్..

పచ్చిమిర్చి...కొత్తమీర...కరివేపాకు...జిలకర్ర...

ఇంగువ...ఉప్పు... అన్నీ వేసి నీళ్ళుపోసి బాగాకలపండి.

చపాతిపిండికన్నా కాస్త లూజుగా వుండాలి.

4)



పిండి...మీరు పెన్నంపై తట్టె టప్పుడు తేలిగ్గా Spread అయ్యెట్లు ఉండాలి...

పిండిలో అంతా కలిపిన తరువాత..ఆరజ్ పండంత పిండి తీసుకొని...

పెన్నంపై ఒక స్పూన్ నూనె వేసి ఈ పిండిని ఆ నూనెపై పెట్టి...నాలుగు వేళ్ళతో

పిండిని తట్టుతూ...రొట్టెలా Spread చేయాలి...

5
)


చేతిలో కాస్త నూనె వేసుకొని పిండిని తట్టితే తేలిగ్గా పిండి Spread అవుతుంది...

ష్టవ్ పై 5 నిముషాలు దోరగా కాల్చిన తరువాత...వేడి వేడిరొట్టేతో

ఆవకాయతోగాని...అల్లం పచ్చడితోగాని...తింటే భలే రుచి...

6
)

( గమనిక...పెన్నం చల్లగా ఉన్నప్పుడే రొట్టె తట్టాలి

పెన్నం వేడిగా ఉన్నప్పుడు తట్టితే...రొట్టే రాదు (అంటదు) చేయికూడ కాలుతుంది )