Sunday, January 28, 2007

దోసకాయ పచ్చడి


దోసకాయలు -- 2

కోత్తమీర కట్ట -- 2 ( చిన్నవైతే 2 పెద్దవైతే 1 చాలు )

గ్రీన్ ఛిల్లీ -- 4

ఎండుమిర్చి -- 6

మెంతులు ఓ -- 20 గింజలు

ఆవాలు -- 1 టేబుల్ స్పూన్

మినపప్పు - - 2 టేబుల్ స్పూన్స్

జీర -- 1/2 స్పూన్

ధనియాలు -- 1/2 స్పూన్

నూనె తగినంత

చింతపండు నిమ్మకాయంత

విడిగా పోపు గింజలు

ఇంగువ , పసుపు , తగినంత ఉప్పు .

!!!!! చేయు విధానం !!!!!

ముందుగా ఒక దోసకాయని సన్నగా తరుకోని వుంచండి.

చింతపండు నానబెట్టి గుజ్జుతీసి వుంచండి .

మూకుడు వేడి చేసి అందులో ఆవాలు , మెంతులు , మినపప్పు , ధనియాలు , ఎండుమిర్చి,

అన్నీ కొద్ది నూనెలో దోరగా వేయించుకొండి .

రెండో దోసకాయను మీకు ఏసైజు కావాలో ఆ సైజు లో తరుక్కోని

గ్రైడర్లో వేయించిన గింజలు, రెండో దోసకాయను

చింతపండు , కోత్తిమీర తరుగు , గ్రీంచిల్లీ , ఉప్పు

పసుపు , అన్నీ వేసి గ్రైండ్ చేసి అందులోనే ఎండుమిర్చి ఇంగువతో పోపు వేసి ఈ సన్నగా తరిగిన

దోసకాయను అందులో కలిపి ఆరగించండి చాలా చాలా రుచిగా వుంటుంది :)

No comments: