Sunday, January 28, 2007

బంగాళాదుంప బంపర్ మసాలా వేపుడు

మీ అభిరుచిని బట్టి ఉప్పు , కారం , అరచంచా ,
గసగసాలు...................3 చెంచాలు
ధనియాలు కొద్దిగా ,
చెక్కా .........................2 లవంగాలు 2 ,
3..............వెల్లుల్లిపాయలు ,
10 ............నీరుల్లిపాయలు ,
చిన్న అల్లం ముక్క ,
పావుకిలో నూనె ,
1 కిలో ................బంగాళా ( గోళీ ) దుంపలు .

చేసే విధానం::

మనం కొన్నవి చిన్న చిన్న గుడ్రపాటి గోళీలాంటి బంగాళదుంపలైతే ఒకసారి కడిగేసి వుడికేయాలి ,


వుడికేసేముందు ఆ నీళ్ళ లో ఉప్పు , పసుపు , వేయాలి ,

వుడికాక తొక్కతీసి ( వేడి తగ్గిన తరువాత ) పెట్టుకోవాలి .

అల్లం , వెల్లుల్లి , చెక్కా , లవంగం , ధనియాలు , గసగసాలు , నీరుల్లిపాయలు ,

అన్నీకలిపి ముద్దగా నూరాలి , నూనె కాచి , మసాల ముద్దను వేయించి ,

పచ్చివాసన పోయేదాకా వేయించాలి .

బంగాళదుంపల్ని అందులో గుమ్మరించి మాంచి వేపుమీద వున్నప్పుడే

తగుపాటి ఉప్పు కారాలుకూడా తగిలించి బాగా వేగనిచ్చి దించుకోవాలి .

వేడి వేడి అన్నంలోకి యమరుచిగా వుంటుంది.~~మరి మీరూ TRY చేస్తారాండీ :)

2 comments:

rajendraprasad said...

really bumper

srinath kanna said...

thabks rajendraprasad garu