Sunday, January 28, 2007

కాకరకాయ వేపుడు


1/4...................కాకరకాయలు ,
ఎండు కారం...............1 టీ స్పూన్ ,
ఉప్పు తగినంత ,
జీరా...................1 టీ స్పూన్ ,
నూనె తగినంత ,
50.............................గ్రాముల ఆనియన్స్
2.......................వెల్లుల్లి రెబ్బలు ( ఇష్ట పడేవారు ) .

చేసే విధానం::

కాకరకాయలు కడిగి గుండ్రంగా చక్రాలుగా కట్ చేసి ఉంచండి,
అవితీసి ప్లేటు లో పెట్టి , ఆనియన్స్ ను కట్ చేయాలి గుండ్రంగా
మూకుడులో నూనె వేసి , కాకరకాయ ముక్కలను వేసి బాగా వేయించి
ఆనియన్ తరుగు వేసి ఎర్రగా వేయించి , మూకుడులో నూనె తీసి ,
వేపుడు ముక్కలలో జీరా వెల్లుల్లి దంచిన ముద్దను , కారం , ఉప్పు , వేసి
రెండు నిముషాలు వేయించి తీయాలి
కరకరలాడాలంటే ఎర్రగా వేయించాలి
మెత్తగా కావాలంటె ముందే తీసేయాలి
రుచికి రుచి..వంటికి ఆరోగ్యకరమైన వంటకం

No comments: