Wednesday, August 22, 2007

డబల్ కా మీటా


!!! కావలసినవి !!!

బ్రెడ్..................10 స్లైసులు
చక్కెర................150 gm
పాలు.................1/2 lit
యాలకుల పొడి......2tsp
కుంకుమపువ్వు చిటికెడు
బాదాం...............5
జీడిపప్పు............6
కిస్‍మిస్..............5
నెయ్యి బ్రెడ్ స్లైసులు వేయించడానికి

!!! చేసే విధానం !!!

ముందుగా బ్రెడ్ స్లైసులను నాలుగు ముక్కలుగా కోసి పెట్టుకోవాలి.

వాటిని నెయ్యిలో ఎర్రగా వేయించి ఉంచుకోండి
పాలు ,చక్కెర, కుంకుమపువ్వు కలిపిమరిగించి చిక్కగా అయ్యేవరకు ఉంచాలి.

బ్రెడ్ ముక్కలను ఒక పెద్ద పళ్ళెంలో పరిచి వాటిపై ఈ వేడి పాలు సమనంగా పోయాలి.
బ్రెడ్ ముక్కలు పాలన్నీ పీల్చుకుంటాయి.

పైన సన్నగా తరిగిన బాదాం, జీడిపపు, కిస్‍మిస్ చల్లాలి.

ఇది వేడిగా కాని చల్లగా కాని వడ్డించాలి.మరి మీరూ మొదలెట్టండి ....ఆ..హా..ఏమి..రుచీ...
~!~!~!~!~!~!~!~!~!~!~!~!~!~!~!~!~!~!~!~!~!~!~!~!~!~!~!~

No comments: