Wednesday, August 22, 2007

నువ్వుల లడ్డు

కావలసినవి

తెల్ల నువ్వులు.......200 gm
బెల్లం.................200 gm
నెయ్యి................2 టేబల్‌స్పూన్స్
ఏలకులు............5

చేసే విధానం::

బెల్లం కరిగించి వడకట్టుకోండి
నువ్వులు మూకుడులో వేసి దోరగా వేయించండి.

బెల్లం ముదురు పాకం చేసుకొని ఉంచండి.

ఒకచిన్న పళ్ళెంలో నీళ్ళు పోసి రెందు చుక్కలు పాకం అందులో వేస్తే అది వెంటనె ఉండకట్టాలి.
అది ముదురు పాకం అంటే....

ఈ ముదురు పాకంలో నెయ్యి, ఏలకుల పొడి నువ్వులు అన్నీ వేసి బాగా కలిపి దించేయండి.

పళ్ళెంలో నెయ్యి రాసి చిన్న గరిటతో ఈ నువ్వులపాకాన్ని కొద్ది కొద్దిగా వేసి
చేయి తడి చేసుకుంటూ జాగ్రత్తగా వేడి మీదనే ఉండలుగ చేసుకోవాలి.
అరగంట ఆరిన తర్వాత డబ్బాలో వేసి పెట్టుకోడమే.
నాగులకు ఈ నైవేద్యమంటే మహా మక్కువ...మీరూ Try చేయండి
ఆ...హా...ఏమి..రుచీ....
****************************************

No comments: