Wednesday, August 22, 2007
పెసర బొబ్బట్లు
కావలసినవి::
పెసరపప్పు........అర కేజీ
చక్కెర...........అర కేజీ
రవ్వ............200gm
మైదా...........ముప్పావు కేజీ
యాలకుల పొడి.....1 టేబల్‌స్పూన్
నెయ్యి లేదా నూనె...పావు కేజీ
పచ్చకర్పూరం......1/3 టేబల్‌స్పూన్
చేసే విధానం::
పెసరపప్పును బాగా కడిగి ఒక గంట సేపు నీటిలో నాననివ్వాలి.
నానిన పప్పును మెత్తగా రుబ్బుకోవాలి.
రుబ్బిన పప్పును ఆవిరిపై ఉడికించుకోవాలి.
ఉడికిన ముద్దను చల్లార్చి చిదిమి పొడి చేసుకుని చక్కరలో కొంచెం నీళ్ళు పోసి తీగ
పాకం పట్టి పెసరపప్పు పిండిని పకంలో చేర్చాలి.
ఉడుకుతుండగా అందులో కొంచెం నెయ్యి,యాలకుల పొడి పచ్చకర్పూరం వేసి గట్టి పడేవరకు వుంచాలి.
ఆ తర్వత దించేయాలి.
చల్లారాక ఈ పూర్ణాన్ని చిన్న చిన్న వుండలు చేసుకుని వుంచుకోవాలి.
మైదా, రవ్వ కలిపి నీళ్ళు పోసి పూరిపిండిలా తడిపి గంట నాననివ్వాలి.
ఒక పాలిధిన్ పేపర్‌కు నూనె రాసి పూరిపిండిని చిన్న వుండలుగా చేసి
వెడల్పుగా వత్తుకుని మధ్యలో పూర్ణం ముద్దను పెట్టి అంచులు మూసేసి
దాన్ని చపాతీలా వత్తుకుని వేడి పెనంపై వేయండి వేస్తూ
రెండువైపులానెయ్యి లేక నునె రాస్తూ కాల్చుకోవాలి.
వేడి వేడి గా తింటే...ఆ..హా..ఏమి..రుచీ...ఆహా..
పండగలకు మాంచి పూర్ణం బొబ్బట్లు ....
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment