Friday, June 12, 2009

చనగపప్పు పచ్చడి



!! కావలసినవి !!
చనగపప్పు (Gramdal) -- 1/2 కప్పు

మినపప్పు --- 1 1/2 టేబల్ స్పూన్స్

ఆవాలు --- 1 టేబల్ స్పూన్

ఎండి మిర్చి --- 4

పచ్చి మిర్చి --- 2

బెల్లం ( jaggery ) 1/2 -- టేబల్ స్పూన్

ఉప్పు --- పసుపు --- రుచికి తగినంత

చిక్కటి చింతపండు రసం --- 2 టేబల్ స్పూన్స్

పచ్చి కొబ్బర ( లేక ఎండుకొబ్బర ) --- 1/4 కప్పు

నునె --- పోపు కు తగినంత ( తాలింపు )

కర్వేపాకు ఒక రెబ్బ

ఇంగువ --- 2 1/4 టీ స్పూన్

పోపు సామాగ్రి ఎండుమిర్చితోపాటు --- 1 టేబల్ స్పూన్

!! తాయారు చేసేవిధం !!

ముందు చనగ పప్పు,ఆవాలు,మినపప్పు,ఎండుమిర్చి,ఎండు కొబ్బర,

అన్నీ నూనె లేకుండగా దోరగా విడి విడి గా బాణలి లో వేయించుకోవాలి.

తర్వాత వేయించిన వాటిని , పచ్చిమిర్చి , పచ్చికొబ్బర , ఉప్పు ,పసుపు ,

బెల్లం , చింతపండు రసం , అన్నీ గ్రైండర్ లో వేసి మెత్తగా రుబ్బుకోవాలి.

రుబ్బిన పచ్చడి పై కర్వేపాకుతో , ఇంగువ వేసి పోపు పెట్టాలి.

వేడి వేడి అన్నానికి పచ్చి నునె వేసుకొని పచ్చడితో తింటే....ఆహా ఏమి రుచి...

వంకాయ పులుసు పచ్చడి


!! కావలసినవి !!

వంకాయలు --- 2

పసుపు --- చిటికెడు

పల్చటి చింతపండు రసం --- 4 టేబల్ స్పూన్స్

బెల్లం పొడి --- 1/4 ---కప్పు

ఆవపొడి --- 1/2 టేబల్ స్పూన్

ఇంగువ --- కొద్దిగా

సోంపు --- 1 టీ స్పూన్

మినపప్పు --- 1 టీ స్పూన్

ఆవాలు --- 1/2 టీ స్పూన్

ఎండు మిర్చి --- 3

పచ్చి మిర్చి --- 2

కరేపాకు --- ఒక రెబ్బ

నునె --- 25 గ్రా

ఉప్పు --- రుచికి తగినంత

!! తయారు చేసేవిధం !!

వంకాయలు కడిగి తుడిచి నునె రాసి కాల్చుకొవాలి.

తర్వాత వాటిని వలిచి ముద్దచేసి వుంచుకోవాలి.

దీనిలో చింతపండు రసం , ఉప్పు , పసుపు , బెల్లం , ఆవపొడి , వేయాలి.

ఇప్పుడు మిగిలిన దినుసులు ( ఆవాలు,మినపప్పు,సోంపు,ఎండుమిర్చి,పచ్చిమిర్చి,

కర్వేపాకు ) అన్నీ వేసి తాలింపు పెట్టి వంకాయలో కలుపుకొవడమే.

కావాలంటే కాచి చల్లారిన నీరు కొంచం పొసి పల్చగా చెసుకొవచ్చు.

కోత్తిమిర తురుము వేసుకొన్నా కమ్మగా వుంటుంది మరి మీరు తయారా ??? :)

నేను చేసి చూసాను నాకు బాగా నచ్చినందుకు మీరూ వండుకొంటారని వేసాను.

ఒకప్పుడు ఆంద్రభూమి సచిత్రవారి పత్రికలో వేసారు .వేసినవారి పేరు అంతగా

తెలియదు ఏదో " మాలతి " అని రావచ్చు అనుకొంటా ? మరి మీకు నచ్చితే కామెంట్ రాస్తారుగా

లక్ష్మి గారూ మీరు అడిగిన పచ్చడి తయార్ వండి మాకు తెలుపండి :)

Thursday, June 11, 2009

వంకాయ పచ్చికారం



!! కావలసినవి !!

వంకాయలు --- 1/2 కిలో

నూనె --- 1 కప్పు

ఉప్పు , రుచికి తగినంత

పసుపు , చిటికెడు

అల్లం ముక్క , గోలికాయంత

పచ్చి మిర్చి --- 6

ధనియాలు --- 1 చెంచా

జిలకర్ర --- చిన్న చెంచా

వెల్లుల్లి --- 6

కొత్తిమిర తరుగు --- 1 కట్ట


!! తయారు చేసే విధానం !!

ముందుగా ధనియాలు,జిలకర్ర,అల్లం,పచ్చి మిర్చి వెల్లుల్లి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.

వంకాయలు చిన్న ముక్కలుగా చేసుకోవాలి.

బాణలి వేడి చేసి అందులో నూనె మూడు వంతులు పోసి నునె వేడెక్కగానే

ముక్కలు వేసి 5 నిమిషాలు మూతపెట్టి వుంచాలి.

తర్వాత ముక్కలు మాడకుండగా కలుపుతూ , ఉప్పు , పసుపు , చల్లి మళ్ళీ బాగా కలపాలి.

వంకాయ ముక్కలు పూర్తిగా వేగినట్లు తెలియగానే పచ్చికారం ముద్ద వేసి బాగా కలపాలి.

వంకాయ ముద్దపై కొత్తమిర చల్లి వేడి వేడి గా వడ్డించడమే....

ఘుమ ఘుమ లాడే వంకాయ పచ్చికారం , చపాతి , రొట్టెల్లోకి , అన్నానికి భలే కమ్మాగా వుంటుంది.

కావాలంటే చనగపప్పు,మినపప్పు,జిలకర్ర,

ఆవాలు ఎండి మిర్చితో పైన పోపు వేసుకోవచ్చు .

కొబ్బరికాయ రవ లడ్డు



!! కావలసినవి !!

రవ్వ -- 1 కప్పు

తాజా తెల్లటి కొబ్బరి తురుము -- 2 కప్పులు

పంచదార -- 1 1/2 కప్పులు

జీడిపప్పు -- కిస్మిస్ -- 20

చిటికెడు కుంకుమ పువ్వు

యాలకుల పొడి -- 1/2 టేబల్ స్పూన్

నెయ్యి -- 1.5 కప్పు


!! చేసే పద్ధతి !!

సన్నటి సెగపై రవ్వను 2, 3, నిమిషాలు వేయించాలి.

రెండు స్పూన్స్ నెయ్యి వేసి జీడిపప్పు , కిస్మిస్ లు వేయించుకోవాలి.

కుంకుమపువ్వును ఒక టీ స్పూన్ పాలలో వేసి

పాలు నారింజరంగుకు మారేవరకు కలియబెట్టి పక్కన వుంచుకోవాలి.

పావుకప్పుకు మించి నీటిని పంచదారలో పోసి వేడి చేసి వడకట్టి

మరో రెండు నిమిషాలు కాచాలి.పాకం బుడగలు వస్తున్నప్పుడు ష్టవ్ కట్టేయాలి.

మందపాటి పాత్రలో నెయ్యివేడి చేసి రవ్వ,కొబ్బరి మిస్రమాన్ని సన్నని సెగపై

5 నుంచి 7 నిమిషాలు వేయించాలి.

ఈ మిశ్రమాన్ని పంచదార పాకంలో పోసి,యలకులపొడి,జీడిపప్పు,కిస్మిస్ లు,

కుంకుమపువ్వు,కలిపిన పాలు వేసి కలియబెట్టాలి.

మిశ్రమం చల్లారాక నిమ్మకాయసైజు ఉండలు చేసుకొని

మూత గట్టిగా వున్న డబ్బాలో వుంచాలి.

అప్పుడప్పుడు మూత తీసి ఉండలు క్రిందికీ పైకీ మారుస్తుంటే

నెలరోజులు పాడైపోకుండగా వుంటాయి. మరి మీరూ రెడినా?

అరటికాయ వేపుడు



!! కావలసినవి !!

అరటికాయలు -- 4

మజ్జిగ --- 2 కప్పులు

పసుపు చిటికెడు

ఉప్పు తగినంత

కారం --- 1 టేబల్ స్పూన్

నూనె --- 3 టేబల్ స్పూన్స్

ఆవాలు , జీలకర్ర , 1 టేబల్ స్పూన్


ఎండు మిర్చి ముక్కలు -- 6


కరివేపాకు --- 1 రెబ్బ

ఇంగువ --- 2 pinches


!! చేసే పద్ధతి !!

అరటికాయ పై పెచ్చు పీల్ చేసి చక్రాలుగా కాని చిన్న ముక్కలుగా కాని

తరిగి మజ్జిగలో వేయాలి లేకుంటే నల్లబడతాయి.బాణలిలో నూనె వేసి

కాగిన తర్వాత ఆవాలు ,జీలకర్ర, ఇంగువ, ఎండు మిర్చి , కరివేపాకు , వేసి అవి చిటపటలాడాకా

అరటిముక్కలు వేసి పసుపు,కారం,ఉప్పు వేసి కలిపి మూత పెట్టాలి.

మధ్య మధ్యలో కదుపుతూ ఎర్రగా దోరగా వేగిన తర్వాత దింపాలి

వేడి వేడి అన్నంలోకి భలే రుచి ఆహా...ఏమి రుచీ :)

పనీర్ ఫ్రైడ్ రైస్


!! కావలసినవి !!

పన్నీర్ ముక్కలు -- 200 గ్రాం

బాస్మతి రైస్ -- 500 గ్రాం

నూనె -- 60 గ్రాం

పచ్చిబఠాణి -- 35 గ్రాం

జీడిపప్పు -- 30 గ్రాం

పచ్చి కొబ్బరి తురుము -- 1/2 కప్పు

క్యారట్ తురుము -- 1/4 కప్పు

ఉల్లికాడల తురుము -- 1/4 కప్పు

చిల్లీ సాస్ -- 1 టీస్పూన్

టొమాటో సాస్ -- 1.5 టీస్పూన్

అల్లం వెల్లుల్లి ముద్ద -- 1.5 టీస్పూన్

గరం మసాలా పొడి -- 1/2 టీస్పూన్

మిరియాలపొడి -- 1/2 టీస్పూన్

!! చేసే పద్ధతి !!

ఒక మూకుడు లో కొద్దిగా నూనె వేడి చేసి ముక్కలుగా కోసిన పన్నీర్ ముక్కలు,జీడిపప్పులు వేయించి పక్కన పెట్టుకోవాలి.

బియ్యం కడిగి కాస్త పొడిపొడిగా వండి పెట్టుకోవాలి.బాణలి లో నూనె వేసి అల్లం వెల్లుల్లి ముద్ద వేసి పచ్చి వాసన పోయేవరకు వేయించాలి.


ఉల్లికాడల తురుము,పచ్చిబఠానీలు,క్యారట్ తురుము వేసి కలిపి కొద్దిగా వేయించాలి.

చిల్లీసాస్,టోమాటో సాస్,మిరియాల పొడి,గరం మసాలా పొడి,తగినంత ఉప్పు వేసి బాగా కలపాలి.

ఇందులోనే పన్నీర్ ముక్కలు,జీడిపప్పు ముక్కలు,బిరుసుగా వండిన అన్నం వేసి అన్నీ బాగా కలియబెట్టాలి.

చివరగా తురిమిన కొత్తిమిర,కొబ్బరి కూడా వేసి 1 నిమిషం ఉంచి దింపేయాలి.

10 నిముషాలు అలానే ఉంచి ఆ తర్వాత వడ్డించేయడమే...

Wednesday, June 10, 2009

మాంగో జామ్


!! కావలసినవి !!

మామిడిపండ్ల ముక్కలు -- 1/2 కిలో

నిమ్మరసం లేదా సిట్రిక్ ఆసిడ్ -- 1/2 స్పూన్

నీరు -- 1 కప్పు

పంచదార -- 1 కప్పు




!! చేసే పద్ధతి !!

మామిడిపళ్ళు పైపెచ్చు తీసి,చిన్న చిన్న ముక్కలు తరిగి

నీరుపోసి బాగా మెత్తగా వుడికించాలి.

పంచదార ముక్కల్లో వేసి కలిసేంతవరకు గరిటతో కలియబెట్టాలి.

సిట్రిక్ ఆసిడ్ లేదా నిమ్మరసం కూడా జామ్ లో కలిపి మాంచి సెగమీద ఉడకనివ్వాలి.

ఉడికిన జామ్ దించి పొడిగా వున్న గాజుసీసాలో పోసుకొని జాం చేసిన రెండో

రోజు నుంచి ఉపయోగించుకోవచ్చు.

ఇది బ్రెడ్,చపాతి,లాంటివాటికి చాలా బాగుంటుంది.