Saturday, April 21, 2007

ఉలువ చారు

ఉలువలు 3 పిడికిళ్ళు
జింజర్ కొద్దిగా
గార్లిక్ 4 పాయలు
ఉప్పు తగినంత
పసుపు చిటికెడు
నూనె ( తాలింపుకు )
ఆవాలు , జీరా , ఎండుమిర్చి.

!!!!! చేసే విధానము !!!!!

ఉలువలు ముందుగా దోరగా వేయించి నీళ్ళు ఎక్కువగా పోసి కుక్కర్ లో మెత్తగా వుడికించాలి . వుడికిన వులవను గరిటతో మెత్తగా చేసుకొని వుంచవలెను . దట్టమైన గిన్నెలో కొద్దిగా నూనె పోసి అందులో ఆవాలు , జీరా , ఎండుమిర్చి , కరేపాకు వేసి వేగిన తరువాత , కోరిన జింజర్ ,సన్నగా తరిగిన వెల్లుల్లి పాయలు , వేసి దోరగా వేయించి అందులో వులువ పేష్ట్ వేసి పసుపు , ఉప్పు , నీళ్ళు , తగినన్ని వేసి బాగా మరగ నీయండి చారు రెడి :)

ఫన్నీర్ మసాల

!! కావలసినవి !!
పన్నీర్ 200 గ్రా
ఉల్లిపాయలు 50 గ్రా
జిలకర 25 గ్రా
ఎండుమెరపకాయలు 4
ధనియాలు పొడి 3 టీ స్పూన్స్
గరం మసాల 5 గ్రా ,అల్లం 25 గ్రా
వెల్లుల్లి 20 గ్రా
పచ్చిపాలకోవా 50 గ్రా
టోమాటో 150 గ్రా
రిపైండ్ ఆయిల్ 75 గ్రా
కోత్తమిర 1 కట్ట
పసుపు చిటికెడు
ఉప్పు తగినంత

చేసే విధానం !!!
ఒక మూకుడు లో నూనె వేసి అది వేడి అయిన తరువాత అందులో 10 గ్రాముల జిలకర , సన్నగ తరిగిన ఆనియన్ అల్లం , వెల్లుల్లి పాయలు వేసి వేయించండి .

ఇవన్నీ కాస్త వేగిన తరువాత , పొడవుగా కోసిన పన్నీర్ ముక్కల్ని కూడా వేసి వేయించాలి . ఈ మిశ్రమం అంతా వేగుతున్నప్పుడే

పొడిచేసిన జిలకర్ర , ఎండుమిరపకాయలు , ధనియాలు , గరం మసాల , పసుపు , కూడా వేసి రెండు నిముషాలు వేయించి పన్నీర్ ముక్కల్ని చేర్చి వుడికించండి . దాంట్లో సిధంగా వుంచుకొన్న టోమాటోలను రసం పిండి

ఆ తర్వాత వాటిని ముక్కలుగా కోసి , ఉడుకుతున్న కూరలో కలిపి , ఉప్పు వేసి , మరో ఐదు నిముషాలు వుడికిన తరువాత మూకుడు ని స్టౌ మీదనుంచి దిపండి .

కోత్తమీర కలిపిన ఈ కూర చపాతికి పలావ్ కి చాలా బావుంటుంది. :)

మీకూ చేయాలని ఆశపుట్టింది కదూ ఆలస్యం ఎందుకూ దూకేయండీ...

Friday, March 30, 2007

కాబేజి రోల్స్

!!!! కావలసినవి !!!!

కాబేజి.................1/4
మొక్కజొన్నపిండి.....10 గ్రాములు
కారెట్స్....................1/4
బియ్యం పిండి..........1/4 కప్
నూనె తగినంత..................

చేసే విధానము::

కాబేజీ , కారెట్ లను కొబ్బరిలాగా తురుమాలి .
పచ్చిమిర్చిని , ఉప్పు , మొక్కజొన్న పిండిని కలపాలి .
దీనిని ముద్దగా చేసి చిన్న చిన్న బాల్స్ లాగా చేయాలి .
మూకుడు లో నూనె వేసి నూనె లో దోరగా వేయించాలి
అంటే దోరగా గోల్డెన్ కలర్ వచ్చెంత వరకు వేయించీ
సాస్ తో గాని చిట్ని తో గాని సర్వ్ చేయండీ..ఆ..హా..ఏమి..రుచీ..ఆహా

చాక్లెట్ కేక్

2 ounces of chocolate
4 ఎగ్స్
1/2 కప్ మిల్క్
1 టీ స్పూన్ వెనీల
1/2 కప్ బట్టర్
1 1/2 కప్ షుగర్
1 టీస్పూన్ నిండుగ బేకింగ్ పౌడర్
1 3/4 కప్స్ ఫ్లోర్

!!! చేసే విధానం !!!

ముందుగా 5 టేబల్ స్పూన్స్ వేడి నీళ్ళల్లో boiling water ఈ చాక్లెట్ ని కరిగించండి . బట్టర్ , క్రీం , వేసి కలపాలి (Beat). Yolk add చేసి మళ్ళికలపండి అంటే బీట్ చేయండి . అందులోనే మిల్క్ వేసి మళ్ళీ కలపండి. కరిగించిన చాక్లెట్ వేసి మళ్ళీ కలపండి . ( బీట్ చేయండి ). మళ్ళి ఫ్లోర్ వేసి కలపండి .ఇంకా బాగా కలపండి ఎంత బీట్ చేస్తే అంత మ్రుదువుగా వస్తుంది .తరువాత ఎగ్ లో వున్న తెల్లటి సోన తీసి విడిగా బాగా నురుగు వచ్చేంత వరకు బీట్ చేసి , కొద్దికొద్దిగా వేస్తూ కలుపుతూ రాండి . తరువాత వెనీల , బేకింగ్ పౌడర్ వేసి జాగ్రత్తగా వుంటలు లేకుండగ కలపండి Mix quickly and lightly, . కేక్ పాన్ లో కొద్దిగ బట్టర్ రాసి అందులో ఈ కలిపిన కేక్ మిక్చర్ ని అందులో వేసి నార్మల్ టెంపరేచర్ ల్లో 45 మినిట్స్ oven లో పెట్టాలి . చాక్లెట్ కేక్ తయార్ :)
మరి చేసి చూస్తారా ?

సేమ్యా పులిహోరా

!! కావలసినవి !!!

సేమ్యా 200 గ్రాములు
ఉల్లిపాయ 1
కరివేపాకు
పల్లీలు
జిలకర
నూనె తగినంత
నెయ్యి కొద్దిగా
ఎండు మిర్చి 6
ఆవాలు
మినపప్పు
నిమ్మకాయ 1

తయారు చేసే విధానం !!!!

పాన్ లో ఒక చెంచా నెయ్యివేసి సేమ్యాను దోరగా వేయించాలి . తరువాత నూనె వేసి తాలింపు సామాను

కరేపాకుతో, ఉలీముక్కలి ఎండుమిర్చి వేసి

అన్నీ ఎర్రగా వేయించాలి. పొయ్యి sim లో వుంచి ముందుగా వేయించి వుంచుకొన్న సేమ్యాను ఇందులో వేసి మరో నిముషానికి దించి పళ్ళెం లో పోసిపెట్టుకోవాలి . అదే పాన్ లో 2 గ్లాసుల నీళ్ళు పోసి సరిపదా ఉప్పు వేయాలి . నీళ్ళు మసలుతుండగా పళ్ళెం లో వేయించి వుంచిన సేమ్యానంతా వేసేయాలి . అది ఉడుకుతుండగా నిమ్మకాయ గింజలు లేకుండగ రసం పిండాలి . stove ని sim చేసి అట్లకాడతో కలుపుతూ 3 నిముషాలతరువాత దింపుకోవాలి ఘుమ ఘుమ లాడే పులిహోర తయార్........

Sunday, January 28, 2007

బీన్స్ పొరియల్

బీన్స్ 200 గ్రా
శనగపప్పు 100 గ్రా
పచ్చిమిర్చి 10
కొబ్బెర తురుము 1/2 కప్పు
అల్లం చిన్న ముక్క
నూనె 100 గ్రా
కరేపాక్ , కోత్తిమీర 2 టేబుల్ స్పూన్స్ తరుగు
తాలింపు గింజలు 2 టీ స్పూన్స్
ఎండుమిర్చి 2 ,ఉప్పు , పసుపు , తగినంత

చేసే విధానం::

శనగపప్పు కడిగి 2 గంటలు నాన బెట్టి జల్లెడలో వేసి నీరు తీసి, పచ్చిమిర్చి , కొబ్బెర , అల్లం , శనగపప్పు , మిక్సిలో వేసి ముద్ద చేసి ఉంచండి . కొంచెం నూకగా రుబ్బాలి , మెత్తగా వుండకూడదు . బాండిలో నూనె వేడి చేసి తాలింపు వేసి ఎండుమిర్చి , కరేపాకు వేసి దోరగా వేగాక బీన్స్ తరుగు , వేసి, మూతపెట్టి వుడికించి , ముక్క వుడికిన తరువాత పసుపు , రుబ్బిన శనగపప్పు ముద్దను , ఉప్పు , వేసి , బాగా దోరగా వేయించి , అట్లకాడతో వేయిస్తు వుండాలి . ముద్ద బాగా పొడి పొడి గా అయ్యేంతవరకు వేయించి కోత్తమీర వేసి సర్వ్ చేయండి , బీన్స్ పొరియల్ నెయ్యి వేసిన రైస్ లోకి , సాంబర్ రైస్ లోకి , రసం రైస్ లోకి , చాలా రుచిగావుంటుంది . ఇది తమిళులు ఎక్కువగా చేస్తారు .

కాకరకాయ వేపుడు


1/4...................కాకరకాయలు ,
ఎండు కారం...............1 టీ స్పూన్ ,
ఉప్పు తగినంత ,
జీరా...................1 టీ స్పూన్ ,
నూనె తగినంత ,
50.............................గ్రాముల ఆనియన్స్
2.......................వెల్లుల్లి రెబ్బలు ( ఇష్ట పడేవారు ) .

చేసే విధానం::

కాకరకాయలు కడిగి గుండ్రంగా చక్రాలుగా కట్ చేసి ఉంచండి,
అవితీసి ప్లేటు లో పెట్టి , ఆనియన్స్ ను కట్ చేయాలి గుండ్రంగా
మూకుడులో నూనె వేసి , కాకరకాయ ముక్కలను వేసి బాగా వేయించి
ఆనియన్ తరుగు వేసి ఎర్రగా వేయించి , మూకుడులో నూనె తీసి ,
వేపుడు ముక్కలలో జీరా వెల్లుల్లి దంచిన ముద్దను , కారం , ఉప్పు , వేసి
రెండు నిముషాలు వేయించి తీయాలి
కరకరలాడాలంటే ఎర్రగా వేయించాలి
మెత్తగా కావాలంటె ముందే తీసేయాలి
రుచికి రుచి..వంటికి ఆరోగ్యకరమైన వంటకం