Sunday, June 10, 2007

పాకం గారెలు

కావలసినవి

పొట్టుమినపప్పు..................50గ్రా
బెల్లం ............................1 Kg
నెయ్యి....................50 గ్రా
యాలకులు.....................5
రిపైండ్ ఆయిల్ తగినంత
ఉప్పు తగినంత

తయార్ చేసే విధం

పొట్టుమినపప్పు నాలుగుగంటలపాటు నీళ్ళల్లో నానబెట్టి
పొట్టువచ్చేవరకుచేతితో రుద్ది నీళ్ళతో కడగాలి .

ఆ తరువాత ఈ పప్పును గ్రైండర్ లో మరీమెత్తగాకాకుండ
గ్రైండ్ చేసి తరిగిన బెల్లం వేసి ఒక గ్లాస్ నీళ్ళుపోసి స్టవ్ మీద పెట్టి
లేతపాకం వచ్చేవరకువేడి చేయాలి .

ఇప్పుడు ఒక మూకుడులో నూనెపోసి వేడికాగానే
మినపప్పు ముద్దను తడి అరచేతిపైన లేదా అరటాకుపైన గాని
అద్ది నూనెలో వేయాలి .
వాటిని ఎర్రగా వేయించి , తీగపాకంలో ముంచి బాగా నాన నివ్వండి .
నోరూరించే పాకం గారెలు రెడి ...మరి మీరూ రెడినా....

No comments: