Sunday, June 10, 2007

అటుకుల ఉప్మా

కావలసినవి !!!

గట్టి అటుకులు..........2 కప్పులు
ఆనియన్.............1
పచ్చిమిర్చి...............2
ఎండుమిర్చి..............2
ఆవాలు..................1/4 టేబల్‌స్పూన్
జీలకర్ర...................1/4 టేబల్‌స్పూన్
మినప్పప్పు.............1 టేబల్‌స్పూన్స్
శనగపప్పు..............1 టేబల్‌స్పూన్
కరివేపాకు...............2 రెబ్బలు
కొత్తిమిర................2 టేబల్‌స్పూన్స్
నూనె..................3 టేబల్‌స్పూన్స్
పచ్చి కొబ్బరి తురుము...3 టేబల్‌స్పూన్స్
ఉప్పు రుచికి తగినంత

చేసే విధానం !!!
ముందు అటుకులను నీళ్ళలో బాగా కడిగి నీళ్ళన్నీపిండేసి ఉంచండి

గట్టి అటుకులు ఐతేనే బాగుంటుంది.

మూకుడులో నూనె వేడి చేసి ఎండుమిర్చి,పోపు సామాను వేసి కొద్దిగా వేపి పసుపు,
తరిగిన ఉల్లిపాయ,పచ్చిమిర్చి, కరివేపాకు వేసి కొద్దిగా వేపాలి.

నీళ్ళు పిండి పెట్టుకొన్న అటుకులను ఈ పోపులో వేసి తగినంత ఉప్పు వేసి
బాగా కలియబెట్టి మూతపెట్టాలి.

రెండు నిమిషాల తర్వాత కొత్తిమిర,కొబ్బరి తురుము వేసి దించేయండి

వేడి వేడి గా తింటే ...ఆ..హా..ఏమి..రుచీ..ఆహా..

No comments: