Sunday, June 10, 2007

బ్రెడ్ బజ్జీలు

కావలసినవి

బ్రెడ్-------------------------- 8 స్లైసులు
శనగ పిండి------------------- 2 కప్పులు
ఉప్పు తగినంత
కారం పొడి -------------------1 tsp
అల్లం వెల్లుల్లి----------------- 1 tsp
వంట సోడా చిటికెడు
గరం మసాల పొడి ------------1/2tsp
వాము లేదా జీలకర్ర ----------1/2tsp
నూనె వేయించడానికి

చేసే విధానం

బ్రెడ్ ముక్కలను త్రికోణాలుగా కట్ చేసి పెట్టుకోవాలి.

వాటిని టోస్టర్లోకాని పెనం పై కాని కాస్త గట్టిపడేటట్టు కాల్చి పెట్టుకోవాలి.
గిన్నెలో శనగపిండి,ఉప్పు,కారం పొడి,అల్లం వెల్లుల్లి ముద్ద, వాము లేదా
జీలకర్ర,గరం మసాలా పొడి,వంట సోడా కలిపి నీళ్ళు పోసి దోసపిండి
మాదిరిగా గరిటజారుగా కలిపి ఓ పది నిమిషాలు ఉంచాలి.
(అరగంటసేపు నానితే ఏ బజ్జీలైనా చాలాబాగా వస్తాయి )

నూనె వేడి చేసి ఒక్కో బ్రెడ్ ముక్కను పిండిలో
ముంచి నూనెలో వేసి ఎర్రగావేయించాలి .
వేడి వేడిగా సాస్ నంజుకుని తింటే వావ్...
ఆ..హా..ఏమి..రుచీ...

No comments: