Sunday, June 10, 2007

అరిసెలు

కావలసినవి::

బియ్యం..............2 కప్పులు
బెల్లం...............2 కప్పులు
నెయ్యి .............5 గ్మ్
యాలకుల పొడి........1 త్స్ప్
నూనె వేయించడానికి తగినంత

చేసే విధానం::

బియ్యం రెండు గంటలు నానబెట్టాలి. తరువాత బియ్యాన్ని తడి మీదనే మెత్తగా
పొడి చేసుకోవాలి ఆరనివ్వకూడదు.

బెల్లం లో అరకప్పు నీరు పోసి ముదురుపాకం..చేసుకోని,
యాలకులపొడి నెయ్యి వేసి కలిపి దింపేసి తడి బియ్యం పిండి వేసి
మొత్తం బాగా కలపాలి.

నూనె వేడి చేసి, బియ్యం పిండిని చిన్న చిన్న ఉండలుగా
చేసుకుని, ప్లాస్టిక్ కాగితంపైగాని అరిటాకుపైగాని నెయ్యి రాసుకుని చేతితో
పూరీల్లాగా వత్తుకుని నూనెలో నిదానంగా ఎర్రగా వేయించుకోవాలి.

(ఇష్టముంటే నెయ్యిలో కూడా కాల్చుకోవచ్చు.)

నూనెలో నుండి తీసి అరిసెలు వత్తే పీటపైగాని
రెండు చిల్లుల గరిటలతోగాని వత్తి నూనె అంతా తీసేసి విడిగా ఆరనివ్వాలి.
ఘుమ ఘుమ లాడే అరిసెలు తయార్...

No comments: