Friday, November 23, 2007

పులిహొర



కావలసినవి::

బియ్యం...................2 కప్పులు
నునె....................4 టేబల్‌స్పూన్స్
పచ్చిమిర్చి................10(కారం కావాలంటే ఎక్కువ వేసుకోండి)
శనగపప్పు................2 టేబల్‌స్పూన్స్
మినపప్పు................2 టేబల్‌స్పూన్స్
జీడిపప్పు.................3 టేబల్‌స్పూన్స్
వేరుశనగపప్పు..............3 టేబల్‌స్పూన్స్
ఆవాలు..................2 టేబల్‌స్పూన్స్
పసుపు..................1/4 టేబల్‌స్పూన్
చింతపండు పేస్టు............8 టేబల్‌స్పూన్స్
ఎండుమిర్చి.............5
కరివేపాకు రెబ్బలు.........3
ఉప్పురుచికి తగినట్లు................

చేసే విధానం::

బియ్యం 3 సార్లు బాగా కడిగి..4 కప్పుల నీళ్ళు పోసి కుక్కర్ లో 2 విజిల్ వచ్చాక దించేయాలి
అన్నం పొడి పొడి గా ఉండాలి...

మూకుడులో..ఒక స్పూన్ నునె వెసి అందులో
కొద్దిగ ఆవాలు..ఎండుమిర్చి..కరివేపాకు ఒకరెబ్బ వేసి
ఆవాలు చిటపట లాడాక చింతపండు గొజ్జుని అందులో వేసి ఉడికించాలి.

సగం ఉడికిన చింతపండు గొజ్జులో పచ్చిమిర్చి వేసి మళ్ళీ చింతపండు ఉడికించాలి,
చింతపండు వుడికి చిక్కపడాలి..నునె పైకి తెలుతుంది.

ఇప్పుడు వుడుకించిన బియ్యాన్నికి పసుపు..ఉప్పు..వేసి బాగా కలిపి
ఈ చింత పండు గొజ్జుని కూడా అందులో వేసి బాగా కలపాలి.

ఇంకో మూకుడు లో నునెను వేసి అందులో ఆవాలు..ఎండుమిర్చి..
మినపప్పు..శనగపప్పు..జీడిపప్పు , వేరుశనగ గుళ్ళు..కరివేపాకు..వేసి బాగా వేయించాలి,

ఈ వేగిన తాలింపుని చింతపండు గొజ్జు కలిపిన అన్నానికి
వేసి బాగా కలపాలి...ఘుమ ఘుమ లాడే పులిహోర తయార్..
పండగలకు ఈ వంటకం మహా శ్రేష్టం

No comments: